KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desam
ఎప్పెడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఐపీఎల్ 2025 ప్రారంభమైపోయింది. ఐపీఎల్ ట్రోఫీ 17ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఆర్సీబీ ఓవైపు...డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో ఉన్న కోల్ కతా మరోవైపు మరి మ్యాచ్ అంటే దెబ్బ దెబ్బా ఉండాలిగా అలాగే జరిగింది ఫస్ట్ మ్యాచ్. ఢిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతాను చిత్తు చేస్తూ ఆర్సీబీ 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం.
1. విరాట్ కొహ్లీ - ది ఛేజ్ మాస్టర్
నువ్వు ప్రపంచంలో ఏడైనా తిరుగు. మోడ్రన్ డే క్రికెట్ లో ఛేజింగ్ మాస్టర్ ఎవర్రా అంటే ఠక్కున చెప్పే కింగ్ విరాట్ కొహ్లీ. ఈడెన్ గార్డ్సెన్స్ లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లోనూ అంతే కోల్ కతా విసిరి 175 పరుగుల టార్గెట్ ను రెస్పెక్ట్ చేస్తూనే అగ్రెషనూ చూపించాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి హాఫ్ సెంచరీ బాదేయటంతో పాటు చివరి కంటూ నిలబడి తన టీమ్ ను విజయంతో టోర్నీ ప్రారంభించేలా చేశాడు కింగ్. కెప్టెన్ గా రజత్ పాటిదార్ కి ఫస్ట్ మ్యాచ్ లోనే విక్టరీ అందించాడు కింగ్ కొహ్లీ.
2. పవర్ ఫుల్ ఫిల్ సాల్ట్
పేరుకే సాల్టే అయినా కోల్ కతా మీద మాత్రం బ్యాట్ తో కారాలు మిరియాలు నూరి వాళ్ల బౌలర్లకు మంటెత్తించాడు. 31 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి కింగ్ కొహ్లీ తో 95పరుగుల ఓపెనింగ్ పార్టనర్ షిప్ ను అందించటంతో పాటు విన్నింగ్ ను ఆల్మోస్ట్ డిసైడ్ చేసేశాడు.
3. కెప్టెన్ క్యామియో - రజత్ పాటిదార్
ఆడిందే చిన్న ఇన్నింగ్సే అయినా తన ఇంటెన్షన్ ఏంటో చూపించాడు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్..16 బంతుల్లోనే 5 ఫోర్లు ఓ సిక్సర్ తో 34 పరుగులు చేసి పాయింట్ కి రా అన్నట్లు ఆడేశాడు. చివర్లో లివింగ్ స్టోన్ కూడా తగులుకోవటంతో ఇంకా 22 బాల్స్ ఉండగానే 3వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీ కొట్టేసింది ఆర్సీబీ
4. రహానే- నరైన్ పార్టనర్ షిప్
కోల్ కతా బ్యాటింగ్ లో బాగా ఎంజాయ్ చేసింది ఏమన్నా ఉంది అంటే అది కెప్టెన్ అజింక్యా రహానే అండ్ సునీల్ నరైన్ పార్ట్ నర్ షిప్పే. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ స్టార్టింగ్ లోనే హేజిల్ వుడ్ బౌలింగ్ లో డికాక్ ని కోల్పోవటంతో ఇబ్బందుల్లో పడుతోందా అనిపించిన టైమ్ లో రహానే, నరైన్ కలిసి రఫ్పాడించారు. ముఖ్యంగా రహానే అబ్బబ్బా ఏమన్నా క్లాసిక్ షాట్సా అవి. 31 బాల్స్ ఆరు ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు రహానే. కేకేఆర్ ఓడిపోయింది కాబట్టి సరిపోయింది కానీ చాలా అంటే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు రహానే. మరో నరైన్ కూడా 26 బాల్స్ లోనే 5 ఫోర్లు 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. కానీ వీళ్లిద్దరూ రెండు పరుగుల తేడాతో అవుట్ అవ్వటంతో కేకేఆర్ మళ్లీ కోలుకోలేదు.
5. కృనాల్ కుమ్మేశాడు
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కి సర్ ప్రైజ్ ప్యాక్ అంటే మాత్రం కృనాల్ పాండ్యా అనే చెప్పాలి. ఏదో మిడిల్ ఓవర్స్ లో రన్స్ కంట్రోల్ చేస్తాడులే అని ఆర్సీబీ ఆక్షన్ లో తీసుకుంటే లేదు తన బౌలింగ్ లోపదును ఉందని ప్రూవ్ చేశాడు కృనాల్. 4ఓవర్లు వేసి 29 పరుగులు మాత్రమే 3వికెట్లు తీశాడు. అవి కూడా ఎవరివి పవర్ ఫుల్ హిట్టింగ్ చేస్తున్న కెప్టెన్ రహానే, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్..ఇక ఫినిషింగ్ వీరుడు రింకూ సింగ్ వి. అయ్యర్, రింకూలను క్లీన్ బౌల్డ్ చేసి పారేశాడు కృనాల్..షాకింగ్ ఫర్ ఫార్మెన్స్ అసలు. కేకేఆర్ బ్యాటింగ్ లో చిన్న కుర్రాడు రఘువంశీకి అప్లాజ్ ఇవ్వాలి. చిన్న క్యామియోనే ఆడినా 22 బాల్స్ లోనే 30 పరుగులు చేసి కనీసం ఆర్సీబీకి 175 పరుగుల టార్గెట్ అయినా పెట్టగలిగాడు.





















