అన్వేషించండి

YS Jagan: అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !

YSRCP: జాతీయ రాజకీయాల్లో ఏ కూటమి వైపు వెళ్లాలో జగన్ తేల్చుకోలేకపోతున్నారు. స్టాలిన్ సమావేశానికి వెళ్లకుండా మోదీకి లేఖ రాసి రెండు వర్గాలను సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు.

Jagan:  వైఎస్ జగన్ రాజకీయంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏపీలో తన పార్టీ పరిస్థితి మాత్రమే కాదు. జాతీయ స్థాయిలో ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై ఆయనకు స్పష్టత లేకుండా పోయింది. ఓ వైపు ఎన్డీఏ కూటమి కాదనేసింది.  ఇండియా కూటమి రమ్మంటోంది. కానీ ాయన మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు.                 

చెన్నై సమావేశానికి జగన్ దూరం 

దక్షిణాదికి నియోజకవర్గాల పునర్విభజన విషయంలో అన్యాయం జరుగుతోందన్న వాదనతో నిర్వహించిన సమావేశానికి డీఎంకే నుంచి ప్రతినిధులు వచ్చి జగన్ ను కలిశారు. అప్పట్లో వారికి వస్తామా లేదా అన్న సమాచారం ఏమీ చెప్పలేదు. చివరికి వెళ్లలేదు. అయితే సన్నిహిత పార్టీగా గుర్తింపు ఉన్న  బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సమావేశంలో పాల్గొంది.  కేటీఆర్  హాజరయ్యారు. కానీ జగన్ మాత్రం వెళ్లలేదు.  స్టాలిన్ తో జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2019లో జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఒకరు . అయినా స్టాలిన్ పిలుపునకు జగన్ స్పందించలేదు. 

గతంలో జగన్ కు మద్దతుగా నిలిచిన ఇండియా కూటమి  

కొద్ది నెలల కిందట జగన్మోహన్ రెడ్డి   ఢిల్లీలో  ధర్నా చేస్తే .. ఆయనకు మద్దతు ఇవ్వడానికి ఇండియా కూటమిలోని పార్టీల నేతలందరూ వచ్చారు. టీడీపీపై విమర్శలు చేశారు.   కానీ జగన్ మాత్రం ఇండియా కూటమికి ఏ విషయంలోనూ మద్దతు ప్రకటించడానికి ధైర్యం చేయలేకపోతున్నారు.  గతంలో పార్లమెంట్ లో ఏ విషయంలోనూ కాంగ్రెస్ కూటమిని సమర్థించలేదు సరి కదా ఇప్పుడు స్టాలిన్‌తో భేటీకి కూడా దూరంగా ఉన్నారు.  దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా లేదా అన్న అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా  భయపడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

లేఖ ద్వారా రెండు వర్గాలను సంతృప్తి పరిచే ప్రయత్నం             

ఢిల్లీలో స్టాలిన్ సమావేశం జరుగుతున్న సమయంలో జగన్ ప్రధానికి ఓ లేఖ రాశారని వైసీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. వచ్చే ఏడాది (2026) జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి అని లేఖలో మోదీని కోరారు. సమావేశానికి వెళ్లకుండా.. బీజేపీని సంతృప్తి పరిచిన ఆయన మోదీకి లేఖ రాసి.. ఆ సమాచారాన్ని స్టాలిన్ కు పంపి.. వారినీ సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. జగన్ తమ వైపే ఉన్నారని కనిమొళి కూడా ప్రకటించారు. 

అయితే రాజకీయాల్లో ఇలా రెండు పడవలపై చేసే ప్రయాణం మనకకే దారి తీస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ ఏదో ఓ కూటమి వైపు మొగ్గితే మంచిదని అంటున్నారు. ఎన్డీఏతో కలిసే అవకాశాలే ఉండనప్పుడు బీజేపీ చల్లని చూపుల కోసం ప్రయత్నించడం రాజకీయంగా నష్టం జరుగుతుందని అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Milchy Milk Controversy: హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?
హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
TDP MLAs Dissatisfaction: టీడీపీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకుపోతున్న అసంతృప్తి - బయటపడుతున్న వారు కొందరే - హైకమాండ్ గుర్తించదా?
టీడీపీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకుపోతున్న అసంతృప్తి - బయటపడుతున్న వారు కొందరే - హైకమాండ్ గుర్తించదా?
Chandrababu Naidu Strategy Against YSRCP: వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. ప్రతి సవాళ్లు చేయొద్దు! టీడీపీ హైకమాండ్ లైన్ వ్యూహమా? చేతకానితనమా?
వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. ప్రతి సవాళ్లు చేయొద్దు! టీడీపీ హైకమాండ్ లైన్ వ్యూహమా? చేతకానితనమా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Embed widget