Horoscope Today: ఈ రాశివారు జీవిత భాగస్వామి సలహా వింటే ధనలాభం పొందుతారు!
Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 23 రాశిఫలాలు
మేష రాశి
రచనా రంగంలో ఉండేవారికి ఈ రోజు మంచిది. సకాలంలో అనుకున్న పని పూర్తికాక ఒత్తిడి ఉంటుంది. చెడు వ్యక్తులను కలుసుకోవాల్సి వస్తుంది. మీ లక్ష్యాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వృషభ రాశి
మీరు ఈ రోజు సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కానీ మీ వ్యక్తిగత పనులను విస్మరించవద్దు. ప్రియమైనవారి నుంచి బహుమతులు పొందుతారు. అతి ఆలోచనలు చేయవద్దు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మిథున రాశి
ఈ రోజు మీ ప్రవర్తనను మంచిగా ఉంచండి. ఆర్థికపరంగా విజయం సాధిస్తారు. మీ సమయాన్ని ఫలించని పనులలో వృథా చేయవద్దు. సంభాషణ ద్వారా ఇబ్బందిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. ప్రత్యర్థుల దగ్గర మీ గౌరవం పెరుగుతుంది. .(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి
ఈ రోజు చాలా అదృష్టవంతులవుతారు. మీ సలహాలను అందరూ అనుసరిస్తారు. వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది . మీరు కొంచెం కష్టంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంట్లో మంచి సమయం స్పెండ్ చేస్తారు.(కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
సింహ రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. మీ సంకల్పం కారణంగా పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. మీరు చాలా మందికి ప్రేరణగా ఉంటారు. ఉద్యోగాలలో మార్పు గురించి ఆలోచించవచ్చు. పాత ఆలోచనలు అక్కడితో వదిలేయండి.(సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కన్యా రాశి
ఈ రోజు వ్యాపార పనులకు ఉత్తమ సమయం. బహుళజాతి సంస్థలలో పనిచేసే వ్యక్తులు బాస్ నుంచి ప్రశంసలు పొందుతారు. ఆన్‌లైన్ సమావేశానికి హాజరవుతారు. పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. భగవంతుడి ఆరాధనకు సమయం కేటాయిస్తారు. ( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
తులా రాశి
ఈ రోజు ఏదైనా క్లిష్ట పరిస్థితులలో చిక్కుకోవచ్చు. మీ బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రయత్నించండి. కుటుంబ విషయాలలో బయటివారి అభిప్రాయాన్ని తీసుకోకండి. సహనంతో పనిచేయడం చాలా ముఖ్యం. విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.తులారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఈ రోజు ఉన్నతాధికారుల మద్దతును పొందుతారు. కొంతకాంగా అనారోగ్యంతో ఉండేవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కూర్చుని మాట్లాడడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కరించుకోండి. కుటుంబంలో ఓ వ్యక్తి గురించి ఆందోళన చెందుతారు. మీ రాశి ఉగాది 2025 ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
ధనస్సు రాశి
ఈ రోజు వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని పొందవచ్చు. సహోద్యోగి చేసే పొరపాట్లను క్షమించి నేర్పించండి. ఇంటి అవసరాలను జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏకాగ్రతతో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల పట్ల ఆప్యాయత పెరుగుతుంది. (ధనస్సు రాశి ఉగాది 2025 ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)
మకర రాశి
ఈ రోజు ఉద్యోగ ఇంటర్వూలకి పిలుపు రావొచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడానికి పోషకమైన ఆహారాన్ని తినండి. పరస్పర సంబంధాలను మరింత లోతుగా కొనసాగించేందుకు ప్రయత్నించండి..మనసులో భారం తొలగించుకునేందు ఇదే మంచి మార్గం. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. (మకర రాశి ఉగాది 2025 ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి)
కుంభ రాశి
మీ పురోగతి గురించి ఈరోజు మీరు భయపడతారు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేయండి. ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతుంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం వల్ల ప్రశాంతత పొందుతారు.
మీన రాశి
ఈ రోజు పని శైలిలో మార్పులు చేస్తారు. జీవిత భాగస్వామి సలహా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. పిల్లల విద్యలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

