Ugadi Rasi Phalalu 2025: వృశ్చిక రాశి ఉగాది పంచాంగం 2025 - అష్టమ గురుడు అయినా మిగిలిన గ్రహబలం బావుంది ..స్వశక్తితో విజయం సాధిస్తారు!
Ugadi Rasi Phalalu 2025 Scorpio: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారి వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

Vrushchika Rasi Ugadi Rasi Phalalu 2025-26: శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి మంచి ఫలితాలే ఉన్నాయి. అష్టమంలో గురు గ్రహం సంచరిస్తున్నా మిగిలిన గ్రహాల ప్రభావం మీపై అంత తీవ్రంగా ఉండదు. ఫలితంగా గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ 2026-2026 మీకు మంచి జరుగుతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. జీవితంలో స్థిరత్వం ఏర్పడతుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఎన్ని చికాకులు ఎదురైనప్పటికీ ప్రారంభించిన పనులు ధైర్యంగా పూర్తిచేస్తారు. మీ మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. ఎలాంటి సంకోచం లేకుండా నిర్భయంగా ఉంటారు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా అందరి సహకారం మీకుంటుంది. మీ జీవన విధానంలో ఊహించని మార్పులుంటాయి.
ఉద్యోగులకు
ఈ ఏడాది వృశ్చిక రాశి ఉద్యోగులకు అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ ఏడాది పర్మినెంట్ అయ్యే అవకాశం తక్కువ. నిరుద్యోగులు కష్టపడితేనే ఫలితం పొందగలరు.
(వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
రాజకీయ నాయకులకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాజకీయ నాయకులకు అంత అనుకూలత ఉండదు. వ్యవహారాలు ఆశించిన స్థాయిలో అనుకూలించవు. ప్రజల్లో మీపై ఉండే విశ్వాసం కోల్పోతారు. అధిష్టాన వర్గాన్ని మెప్పించలేరు. డబ్బులు ఖర్చవుతాయి కానీ ఫలితం దక్కదు. మీ మాటతీరే మీకు పదవులను దూరం చేస్తుంది.
కళాకారులు
కళారంగంలో ఉండేవారికి ఈ ఏడాది యోగకాలమే. టీవీ, సినిమా రంగాల్లో పనిచేసేవారు నిలదొక్కుకుంటారు. కవులు, రచయితలకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వ్యాపారులకు
వృశ్చిక రాశి వ్యాపారులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అద్భుతంగా కలిసొస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారి అడుగు ముందుకు పడుతుంది. అన్ని రంగాల్లో ఉండే వ్యాపారులు లాభపడతారు. నిర్మాణ రంగం, కాంట్రాక్టు వ్యాపారం చేసేవారికి భారీ లాభాలొస్తాయి.
తులా రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
విద్యార్థులకు
వృశ్చిక రాశి విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు బాగా రాస్తారు. ఉన్నత చదువులు చదవాలని ఆశపడేవారి కల నెరవేరుతుంది. సోమరితనం, నిర్లక్ష్యం వీడకపోతే ఎలాంటి ఫలితాలు పొందలేరు.
వ్యవసాయదారులకు
వ్యవసాయదారులకు గురుడి అనుకూలత లేనందున మంచి లాభాలు ఆర్జించడం కష్టమే. దిగుబడి బాగున్నా ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేరు. అయితే గతంలో చేసిన అప్పులు తీర్చేస్తారు. చేపలు, రొయ్యలు చెరువుల వారికి లాభాలొస్తాయి.
(కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
స్త్రీలకు
వృశ్చిక రాశి స్త్రీలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అన్ని విధాలుగా బావుంటుంది. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ సలహాకు విలువ పెరుగుతుంది. వివాహం కానివారికి ఈ ఏడాది వివాహ సూచన ఉంది. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తలమధ్యసరైన అవగాహనఉంటుంది. ఇప్పటికే గొడవల్లో పడి విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకుంటారు. ఉద్యోగంలోనూ ఈ రాశి స్త్రీలకు ప్రతిభకు తగిన గుర్తింపు ఉంటుంది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి అష్టమంలో గురుడు ఉన్నప్పటికీ శని, రాహువు ప్రభావంతో మంచే జరుగుతుంది.
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
( కన్యారాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

