అన్వేషించండి

Ugadi Rasi Phalalu 2025: ఈ ఉగాది తర్వాత లాభపడే ఉద్యోగులు ఎవరు, బాధపడే ఉద్యోగులు ఎవరు - మీ రాశి ఏం చెబుతోంది!

Career Horoscope 2025 - 26: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతోంది..ఈ కొత్త ఏడాదిలో మేషం to మీనం ఏ రాశి ఉద్యోగుల కెరీర్ ఎలా ఉంది?

Ugadi Rasi Phalalu 2025

మేష రాశి
 
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేష రాశి ఉద్యోగులకు శుభ సమయం. గురు గ్రహం అనుకూతల వల్ల ఉన్నతాధికారుల కరుణ మీపై ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారి ఆదాయం పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగులు మంచి ఇంక్రిమెంట్ సాధిస్తారు లేదంటే మరో ఉద్యోగం సాధించడంలో సక్సెస్ అవుతారు. నిరుద్యోగుల నిరీక్షణ నెరవుతుంది కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరాశ తప్పదు. 
 
వృషభ రాశి

కొత్త ఏడాదిలో ఈ రాశి ఉద్యోగులకు తిరుగులేదు. సమస్యలు ఎదురైనా కానీ అంతిమంగా మీకు మంచే జరుగుతుంది.  ఉద్యోగం విషయంలో గందరగోళం ఉండేవారికి స్థిరత్వం వస్తుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఉన్నతాధికారుల ప్రశంసలు.. అసలు సమస్యే లేదు. మీ తెలివితేటలకు గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది

మిథున రాశి

ఈ రాశి ఉద్యోగులకు యోగకాలం. ఉన్న చోట ప్రమోషన్ లేదంటో మరో కంపెనీలో ఉన్నత స్థానం పొందుతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మంచి ఇంక్రిమెంట్ ఉంటుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగం సాధిస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు శుభవార్త వింటారు. 
 
కర్కాటక రాశి

ఈ రాశి ఉద్యోగులకు ఈ సంవత్సరం మహోన్నతగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడినబదిలీలు, ప్రైవేట్  ఉద్యోగుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. జూలై వరకూ చికాకులు ఉన్నప్పటికీ ఆ తర్వాత మొత్తం ఈ రాశి ఉద్యోగులకు శుభసమయమే. 

సింహ రాశి

ఈ ఏడాది సింహ రాశి ఉద్యోగులకు అస్సలు కలసి రాదు. ఎన్ని తెలివి తేటలు ప్రదర్శించినా ఈ ఏడాది సమస్యల నుంచి తప్పించుకోవడం కష్టమే. ఊహించని అవమానాలు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పవు. ప్రైవేట్ ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. నిరుద్యోగులు ఆశించినస్థాయిలో సెటిలవలేరు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిరాశ తప్పదు.

కన్యా రాశి

గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలనుంచి ఈ రాశి ఉద్యోగులకు ఉపశమనం..ఇకపై అన్నీ మంచి రోజులే అన్నట్టుంటుంది.  ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ ఉంటాయి. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది

తులా రాశి 

తులా రాశి ఉద్యోగులకు ఆహా అనేలా ఉంది. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి పూర్తిగా బయటపడిపోతారు. శని యోగకారకుడు కావడంతో ఈ రాశి ఉద్యోగులకు అంతా మంచే జరుగుతుంది. ఈ ఏడాది మీకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆదాయ మూలాలు పెరుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందుతారు.  

వృశ్చిక రాశి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో  వృశ్చిక రాశివారికి అష్టమంలో గురుడు ఉన్నప్పటికీ ప్రభావం అంతగా ఉండదు. అర్ధాష్టమ శని తొలగిపవడంతో మంచి రోజులు మొదలవుతాయి. ఈ రాశి ఉద్యోగులకు జీతం, హోదా పెరుగుతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు.

ధనుస్సు రాశి

గురుగ్రహం శుభస్థానంలో ఉండండతో ఈ రాశి ఉద్యోగులకు ఈ ఏడాది మహోన్నతంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న వారికి మంచి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. నిరుద్యోగులు ఈ ఏడాది మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది

మకర రాశి

ఈ ఏడాదితో మీకు ఏల్నాటి శని వదిలిపోతుంది. గురు గ్రహం, రాహువు కూడా శుభ స్థానంలో ఉన్నారు. ఫలితంగా ఈ రాశి ఉద్యోగులకు యోగకాలం అనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగులు మంచి ఇంక్రిమెంట్స్ పొందుతారు. ఉన్నతస్థాయి కంపెనీలో అవకాశాలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కల నెరవేరుతుంది.  మార్చి నుంచి జూలై మధ్య ఓ శుభవార్త వింటారు.

కుంభ రాశి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీకు ఏల్నాటి శని ఉంది. ఫలితంగా కష్టపడితేనే ఫలితం సాధిస్తారు. అదృష్టాన్ని అస్సలు నమ్ముకోవద్దు. జన్మ రాహువు కారణంగా ఇబ్బందులుంటాయి కానీ ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్తారు. మీ తెలివితేటల్ని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగం సాధిస్తారు.

మీన రాశి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి ఉద్యోగులకు అంతా బావున్నట్టే అనిపిస్తుంది కానీ ఏదో సమస్య వెంటాడుతూనే ఉంటుంది. వస్తాయి అనుకున్న ప్రమోషన్లు ఆగిపోయే అవకాశం ఉంది. అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. ఉద్యోగం మారాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. నిరుద్యోగులు ఈ ఏడాది ఉద్యోగం సాధించడం కష్టమే.  

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

మీ నక్షత్రం ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

 ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Betting Apps Case Scam: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
Bihar Crime News: నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Andhra Pradesh News: సంతకాలు పెడుతున్నారు సభకు రావడం లేదు- వైసీపీ నేతల తీరుపై అయ్యన్న అసహనం 
సంతకాలు పెడుతున్నారు సభకు రావడం లేదు- వైసీపీ నేతల తీరుపై అయ్యన్న అసహనం 
Betting App Cases:రానా, విజయ్‌దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాశ్‌ రాజ్ సహా 25 మందిపై బెట్టింగ్ యాప్స్‌ కేసులు
రానా, విజయ్‌దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాశ్‌ రాజ్ సహా 25 మందిపై బెట్టింగ్ యాప్స్‌ కేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Betting Apps Case Scam: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
Bihar Crime News: నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
నీళ్ల కోసం కేంద్రమంత్రి ఇంట్లో రక్తపాతం- ఒక మేనల్లుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం
Andhra Pradesh News: సంతకాలు పెడుతున్నారు సభకు రావడం లేదు- వైసీపీ నేతల తీరుపై అయ్యన్న అసహనం 
సంతకాలు పెడుతున్నారు సభకు రావడం లేదు- వైసీపీ నేతల తీరుపై అయ్యన్న అసహనం 
Betting App Cases:రానా, విజయ్‌దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాశ్‌ రాజ్ సహా 25 మందిపై బెట్టింగ్ యాప్స్‌ కేసులు
రానా, విజయ్‌దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాశ్‌ రాజ్ సహా 25 మందిపై బెట్టింగ్ యాప్స్‌ కేసులు
Telangana Latest News: ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
ప్లేటు మార్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, పార్టీ మారలేదంటూ సుప్రీంకోర్టులో వరుస అఫిడవిట్లు..!
Andhra Pradesh Weather: ఏపీలోని ఈ మండలాల ప్రజలకు బిగ్ అలర్ట్-  చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఏపీలోని ఈ మండలాల ప్రజలకు బిగ్ అలర్ట్- చాగలమర్రిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
L2 Empuraan Trailer: 'సలార్' రేంజ్ ఎలివేషన్స్‌తో దుమ్మురేపుతున్న 'ఎల్2 ఎంపురాన్' ట్రైలర్... మోహన్ లాల్, పృథ్వీరాజ్ కుమ్మేశారుగా
'సలార్' రేంజ్ ఎలివేషన్స్‌తో దుమ్మురేపుతున్న 'ఎల్2 ఎంపురాన్' ట్రైలర్... మోహన్ లాల్, పృథ్వీరాజ్ కుమ్మేశారుగా
TDS New Rules: ఏప్రిల్ నుంచి కొత్త టీడీఎస్‌ రూల్స్‌, తగ్గనున్న పన్నుల మోత - ఏ విషయాలు మారతాయి?
ఏప్రిల్ నుంచి కొత్త టీడీఎస్‌ రూల్స్‌, తగ్గనున్న పన్నుల మోత - ఏ విషయాలు మారతాయి?
Embed widget