అన్వేషించండి

Karnataka Rains: కర్ణాటకలో వడగళ్ల వాన.. మినీ కాశ్మీర్‌గా మారిన రోడ్లు- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

Bengaluru Rains | కర్ణాటకలో కురిసిన అకాల వర్షాలతో వేసవి తాపం తగ్గి వాతావరణం చల్లగా మారింది. బెంగళూరుతో పాటు ధార్వాడ్ జిల్లాల్లో రహదారులపై వడగళ్లు కుప్పలుగా పేరుకుపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది.

Karnataka Rain Videos: కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం కురిసిన అకాల వర్షాలు ఎండల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనాన్ని కలిగించాయి. రాజధాని బెంగళూరులోని సంజయ్‌నగర్, యలహంక, దేవనహళ్లి వంటి ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల కొద్దిసేపు వడగళ్ల వాన కురిసి రోడ్లను కాశ్మీర్‌లా తెల్లగా మార్చేసింది. కర్ణాటక రోడ్లు చూసిన నెటిజన్లు కాశ్మీర్‌ను తలపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. కోణనకుంటె, కనకపుర రోడ్, ఆర్‌ఆర్ నగర్, సిబిడి పరిసరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

హెల్ప్ లైన్ నెంబర్స్ ఏర్పాటు

ఈ అకాల వర్షం కారణంగా బెంగళూరులో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బెంగళూరు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 1.3°C మేర తగ్గి 32.3°Cకి చేరుకోగా, హెచ్‌ఏఎల్ విమానాశ్రయం వద్ద 32°Cగా నమోదైంది. హెచ్‌ఏఎల్ (HAL) విమానాశ్రయం వద్ద 1.2°C తగ్గి 32°Cకి చేరుకుంది. జీబీఏ (GBA) విపత్తు నిర్వహణ బృందం ప్రజలకు సహాయం కోసం హెల్ప్‌లైన్ 1533 లేదా వాట్సాప్ నంబర్ 94806 85700ను సంప్రదించాలని కోరింది.

వాతావరణంలో వచ్చిన ఈ మార్పుతో నగరవాసులు చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ బృందం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం కూడా బెంగళూరు పరిసర ప్రాంతాలతో పాటు మైసూర్, మాండ్య, హాసన్ వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అంచనా వేసింది.

ధార్వాడ్ జిల్లా కల్ఘట్గి తాలూకాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కల్ఘట్గి-ముండగోడ్ హైవేపై వడగళ్లు కుప్పలుగా పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మాచాపూర్, బేతదూర్ గ్రామాల్లో రోడ్లు, పొలాలు, ఇంటి పైకప్పులు మంచు కురిసినట్లుగా వడగళ్లతో నిండిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ అరుదైన దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తూ, వడగళ్లను సేకరిస్తూ సందడి చేశారు. ఈ వర్షాలు వేసవి తాపం తగ్గించినప్పటికీ, కొన్ని చోట్ల పంట పొలాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నేడు (మార్చి 18న) బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, రామనగర, తుమకూరు, మాండ్య, చిక్కమగళూరు, శివమొగ్గ, హసన్, కొడగు, దావణగెరె, మైసూర్, చామరాజనగర్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎమ్‌డీ (IMD) అంచనా వేసింది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
India Census 2027: జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జనాభా లెక్కల్లో తప్పుడు సమాధానాలు ఇస్తే ఏమవుతుంది, జైలు శిక్షనా ? జరిమానా విధిస్తారా
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Embed widget