అన్వేషించండి

CM Revanth Musi Revival Project: అగ్నిపరీక్షగా మూసి ప్రక్షాళన - మాటలకే ఇంత కాలం మరి చేతలెప్పుడు?

Musi Politics: తెలంగాణలో రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి ప్రాజెక్టు చుట్టూ అనేక రాజకీయాలు జరుగుతున్నాయి. కానీ రేవంత్ ముందుకెళ్తున్నారు. పనుల్లో ఇంకా ప్రాథమిక దశ కూడా దాటలేదు.

CM Revanth plans for Musi revival project : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసి పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో,  ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి నదిని లండన్ లోని థేమ్స్ నదిలా మారుస్తామని, నదీ తీరాన్ని ఆర్థిక హబ్‌గా మారుస్తామని భారీ స్థాయిలో ప్రచారం కల్పిస్తున్నారు. ఇటీవలే  రూ.7,000 కోట్లతో మొదటి విడత పనుల మాస్టర్ ప్లాన్‌ను కూడా ఆవిష్కరించారు. అయితే, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా, పనులు ఇంకా ప్లానింగ్ , సర్వే దశలోనే ఉన్నాయి. 55 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు కేవలం భూసమీకరణ నోటిఫికేషన్లు , కొన్ని ప్రాథమిక నిర్మాణాలకే పరిమితం కావడం ప్రజల్లో సందేహాలను రేకెత్తిస్తోంది.

వివాదాల సుడిగుండంలో నిర్వాసితులు

ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద అడ్డంకి నిర్వాసితుల సమస్య. నది పరివాహక ప్రాంతంలోని దాదాపు 10,000 పేద కుటుంబాలను తరలించడం అనేది ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. మూసి జన ఆందోళన వంటి వేదికల ద్వారా బాధితులు తమ నిరసనలు తెలుపుతుండగా, ప్రతిపక్షాలు దీనిని  లూటిఫికేషన్  అని విమర్శిస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ, తమ జీవనోపాధి దెబ్బతింటుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయంగా ఈ వ్యతిరేకతను అధిగమించడం రేవంత్ సర్కార్‌కు పెద్ద సవాలు. 

వెంటాడుతున్న నిధుల సమస్య 

ప్రభుత్వ పదవీకాలంలో మిగిలి ఉన్న రెండున్నరేళ్ల సమయం ఈ భారీ ప్రాజెక్టుకు చాలా తక్కువ. 2027-28 నాటికి మొదటి విడత పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ, నిధుల సమీకరణ, వాస్తవ నిర్మాణం వంటి క్లిష్టమైన దశలు దాటాల్సి ఉంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు  వంటి సంస్థల నుంచి నిధులు ఆశిస్తున్నప్పటికీ, అవి సకాలంలో అందడం,  పనుల్లో వేగం పెంచడంపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

రాజకీయ పరపతికి పందెం

ప్రజలు కేవలం విజన్ను చూసి ఓట్లు వేయరు, ఫలితాలను బట్టి నిర్ణయించుకుంటారు. ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పడం రాజకీయంగా ప్రయోజనం చేకూర్చవచ్చు కానీ, సామాన్య ప్రజలు మాత్రం క్షేత్రస్థాయిలో మార్పును కోరుకుంటారు. ఒకవేళ వచ్చే రెండున్నరేళ్లలో కనీసం 50 శాతం పనులు కూడా పూర్తి కాకపోతే, ఇది కేవలం మాటల సీఎం  అనే విమర్శకు ఆస్కారం ఇస్తుంది. గత ప్రభుత్వాల హయాంలో కూడా ఇలాంటి ప్రకటనలు వచ్చి ఆగిపోయిన చరిత్ర ఉండటంతో, రేవంత్ రెడ్డిపై ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంది.

పనుల్లోవేగం పెంచాలి !

కేవలం గ్రాఫిక్ డిజైన్లు, ప్రసంగాలకే పరిమితం కాకుండా, ప్రభుత్వం తక్షణమే పనులను పట్టాలెక్కించాలి. నదిలో మురికినీరు కలవకుండా చేసే ఎస్టీపీల (STPs) నిర్మాణం, నదీ గర్భం ప్రక్షాళన వంటి ప్రాథమిక పనులు కంటికి కనిపిస్తేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో పారదర్శకత పాటిస్తూ, ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా పనుల పురోగతిని చూపడమే రేవంత్ రెడ్డి ముందున్న ఏకైక మార్గమన్న అభిప్రాయం వినిపిస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Kaleshwaram Project: కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ నేత రామచందర్‌రావు లేఖ
కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్, NDSA నివేదిక పట్టించుకోలేదు: CM రేవంత్‌‌కు రామచందర్‌రావు లేఖ
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
Embed widget