Telangana Assembly: కేటీఆర్ రాజీనామా సవాల్ - డీటైల్స్ ఇచ్చిన సీతక్క - అసెంబ్లీలో హైవోల్టేజ్ పాలిటిక్స్ !
KTR resignation challenge: మహిళా రుణాల అంశంపై కేటీఆర్ రాజీనామా సవాల్ చేశారు. అయితే వెంటనే ప్రభుత్వం అన్ని వివరాలను బయటపెట్టి కేటీఆర్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

KTR vs Seethakka: తెలంగాణ అసెంబ్లీ వేదికగా మహిళా రుణాల అంశం ఇప్పుడు రాజీనామా సవాల్‌గా మారి రాజకీయ సెగలు పుట్టిస్తోంది. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేటీఆర్ విసిరిన సవాల్‌ను, పక్కా ఆధారాలతో తిప్పికొట్టామని మంత్రి సీతక్క ప్రకటించడంతో ఈ వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది.
తెలంగాణ శాసనసభలో మహిళా సంక్షేమంపై జరుగుతున్న చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాష్ట్రంలోని మహిళా సంఘాలకు గత రెండు సంవత్సరాల్లో ఏకంగా 57,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు అందించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఈ గణాంకాలను తీవ్రంగా ఆక్షేపించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఒకవేళ మీరు చెప్పినట్లు 57,000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఆర్డర్ కాపీ చూపిస్తే, నేను ఇప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతాను అంటూ అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటీఆర్ ఛాలెంజ్
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 17, 2026
రూ. 57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని డిప్యూటీ సీఎం ఆన్-రికార్డు చెప్పారు
అదే నిజమైతే ఆర్డర్ కాపీ చూపించమనండి.. ఇక్కడే రాజీనామా చేసి వెళ్ళిపోతా
- కేటీఆర్ pic.twitter.com/msW8u9fjPG
కేటీఆర్ సవాల్‌ను స్వీకరించిన మంత్రి సీతక్క, వెంటనే గణాంకాలతో కూడిన వివరాలను సభ ముందు ఉంచారు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా విడుదల చేసిన రుణాల మొత్తం, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రస్తావిస్తూ ఆమె కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. కేవలం రుణాలు ఇవ్వడమే కాదు, వాటిపై పడే వడ్డీ భారాన్ని కూడా భరిస్తూ ఇప్పటివరకు 1,390$ కోట్ల రూపాయల వడ్డీని ప్రభుత్వం చెల్లించింది. అన్ని ఆధారాలు బయటపెట్టాం, ఇప్పుడు కేటీఆర్ తన మాటకు కట్టుబడి రాజీనామా చేయాలి అని సీతక్క డిమాండ్ చేశారు. సభకు వచ్చే ముందు కనీస హోం వర్క్ చేయకుండా, కేవలం రాజకీయ ప్రగల్భాల కోసం సవాళ్లు విసిరి కేటీఆర్ ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో కేటీఆర్ క....
— Congress for Telangana (@Congress4TS) March 17, 2026
మంత్రి సీతక్క సీరియస్ కౌంటర్..
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో పనిచేస్తున్నాం
ఇప్పటివరకు మహిళా సంఘాలకు ఈ రెండు సంవత్సరాల్లో 57 వేల కోట్ల రుణాలు ఇప్పించాం
మహిళా రుణాలకు సంబంధించి 1390 కోట్లు ఇప్పటివరకు మహిళలకు వడ్డీలు చెల్లించాం… pic.twitter.com/cjyYA1nSlQ
ఇదే క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని కూడా సీతక్క ఎండగట్టారు. గత పదేళ్ల కాలంలో మహిళా సంఘాలకు అందాల్సిన 4,000 కోట్ల రూపాయల వడ్డీని కేసీఆర్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, పేద మహిళల భద్రత కోసం ఉద్దేశించిన అభయహస్తం నిధులను కూడా దారి మళ్లించారని ఆమె విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకున్న కేటీఆర్, ఇప్పుడు ఆధారాలతో సహా దొరికిపోయారని.. రాజీనామా చేసి తన విలువను కాపాడుకోవాలని ఆమె సూచించారు. సభలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పరిణామాలతో అసెంబ్లీ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ట్రెండింగ్ వార్తలు






















