Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Sushant Singh Rajput Case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆత్మహత్యగా సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈమేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ కోర్టుకు నివేదిక సమర్పించింది.

Sushant Singh Rajput Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో మృతి చెందిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టుకు క్లోజర్ నివేదిక సమర్పించింది. ఇది ఆత్మహత్య అని ఆ రిపోర్టులో తేల్చింది. సుశాంత్ సింగ్ 14 జూన్ 2020న బాంద్రాలోని తన ఇంట్లో చనిపోయాడు. మొదట్లో ఈ కేసు ఆత్మహత్యగా అనిపించింది, కానీ తరువాత వచ్చిన ఆరోపణలతో దీనిపై ప్రభుత్వం సీబీఐతో దర్యాప్తు చేయించింది.
సింగ్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించినప్పటికీ, ఘటన స్థలం నుంచి ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదు. తరువాత రియా చక్రవర్తి సహా ఇతరులపై సుశాంత్ కుటుంబం పాట్నాలో కేసు పెట్టడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, దొంగతనం వంటి ఆరోపణలపై ఈ కేసు దర్యాప్తు సాగింది.
ఇది అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. సినీ ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. అందుకే అప్పటి బిహార్ ప్రభుత్వ సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును సిబిఐతో దర్యాప్తు చేయాలని 19 ఆగస్టు 2020న ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ శనివారం (మార్చి 22, 2025) తుది నివేదిక కోర్టుకు సమర్పించింది. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని పేర్కొంది.
సీబీఐ నివేదికలో ఏం చెప్పింది?
1. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు, ఎవరూ అతన్ని చనిపోయేలా బలవంతం చేయలేదు.
2. రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చింది సీబీఐ.
3. ఎటువంటి నేర కోణం లేదా కుట్ర జరగలేదు.
4. AIIMS ఫోరెన్సిక్ బృందం కూడా హత్య అనే ఆరోపణలను తోసిపుచ్చింది.
5. సోషల్ మీడియా చాట్‌లను దర్యాప్తు కోసం అమెరికాకు పంపింది. అక్కడ కూడా ట్యాంపరింగ్‌కు సంబంధించిన ఆధారాలు ఏం లభించలేదు.
AIIMS ఫోరెన్సిక్ నివేదిక
సుషాంత్‌పై విషప్రయోగం జరిగిందని, గొంతు కోసి చంపేశారనే ఆరోపణలను AIIMS ఫోరెన్సిక్ నిపుణులు తోసిపుచ్చారు. ఈ నివేదిక ఆధారంగా CBI తన దర్యాప్తును పూర్తి చేసింది.
క్లోజర్ రిపోర్ట్ అంటే ఏమిటి?
ఇంతకీ క్లోజర్ రిపోర్ట్ అంటే ఏమిటి? దీని ఆధారంగా కోర్టు తన తీర్పును ఇవ్వగలదా? క్లోజర్ నివేదికను దాఖలు చేసిన తర్వాత, దానిని ఎక్కడ సవాలు చేయవచ్చు? అంటే... దర్యాప్తు సంస్థ (పోలీస్ లేదా CBI) ఒక కేసు దర్యాప్తు పూర్తైన తర్వాత, ఆ కేసును మరింత దర్యాప్తు చేయడానికి తగినంత ఆధారాలు లేవని అధికారులు భావించినప్పుడు, మేజిస్ట్రేట్ ముందు ఒక నివేదికను దాఖలు చేస్తారు. దానిని క్లోజర్ రిపోర్ట్ అంటారు. ఈ నివేదిక CrPC సెక్షన్ 169 కింద దాఖలు చేస్తారు. ఈ నివేదికలో దర్యాప్తు సంస్థ ఆధారాలు, వాటిని బేస్ చేసుకొని చేసిన ముగింపును తెలియజేస్తుంది. నేరం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడిస్తుంది.
ఒక దర్యాప్తు సంస్థ ఒక కేసులో ముగింపు నివేదికను మేజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టు పరిశీలిస్తుంది. ఆ తర్వాత దానిని తిరస్కరించవచ్చు లేదా ఆమోదించవచ్చు. క్లోజర్ రిపోర్ట్ ఆధారంగా కోర్టు కూడా తన తీర్పును ఇవ్వవచ్చు. ఈ నివేదిక తిరస్కరిస్తే తదుపరి దర్యాప్తునకు కూడా ఆదేశించవచ్చు.
ముగింపు నివేదికను సవాలు చేయవచ్చా?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికను సవాలు చేయగలరా? అంటే చట్టం ప్రకారం ఏదైనా క్లోజర్ రిపోర్టును సవాలు చేయవచ్చు. ఈ కేసులో కొన్ని ఆధారాలు పరిగణనలోకి తీసుకోలేదని బాధితుడు లేదా ఆ వ్యక్తి కుటుంబం భావిస్తే అలా చేయవచ్చు. ఇక్కడ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబం కూడా వ్యతిరేక పిటిషన్ దాఖలు చేయవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

