Sushant Singh Rajput: తమ్ముడి ఆత్మ చూశా, కైలాశంలో సంతోషంగా ఉన్నాడు - సుశాంత్ సింగ్ అక్క శ్వేతా షాకింగ్ కామెంట్స్
Shweta Singh Kirti: బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై తన అక్క శ్వేతా తరచుగా మాట్లాడుతూనే ఉంటుంది. అదే క్రమంలో తాజాగా సుశాంత్ ఆత్మ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Sushant Singh Rajput Sister Shweta Singh Kirti: యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో ఒక రేంజ్‌లో దుమారం రేకెత్తిచ్చింది. అసలు సుశాంత్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, అది కచ్చితంగా హత్యే అని ఎన్నో రూమర్స్ కూడా సినీ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. నెపోటిజం, డ్రగ్స్.. వీటన్నింటిపై బాలీవుడ్‌లో చాలాకాలం చర్చ సాగింది. ఇప్పటికీ సుశాంత్‌ను గుర్తుచేసుకుంటున్న ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రేక్షకులతో పలు విషయాలు షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చింది.
ఉన్నట్టుగా ఫీల్ అయ్యేలా చేస్తాడు..
సుశాంత్ మరణించిన చాలాకాలం వరకు తన అక్క శ్వేతా.. ఎక్కువగా మెడిటేషన్ పైనే దృష్టిపెట్టింది. విపాస్సన, మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ తమ్ముడిని కోల్పోయిన బాధ నుండి బయటికి రావాలని ప్రయత్నాలు చేసింది. సుశాంత్‌కు నలుగురు అక్కలు ఉండగా.. అందరితో తనకు ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. తాజాగా సుశాంత్ ఆత్మ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది శ్వేతా. ‘‘సుశాంత్‌ది చాలా బలమైన, స్వచ్ఛమైన ఆత్మ. తను ఎప్పుడు కావాలనుకున్న తను ఉన్నట్టుగా మేము ఫీల్ అయ్యేలా చేస్తాడు’’ అంటూ షాకింగ్ విషయాలు చెప్తూ.. అది నిరూపించడానికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని స్టేట్‌మెంట్ ఇచ్చింది శ్వేతా.
శివుడితో ఉన్నాడు..
తనకు వచ్చిన కలలో కైలాసంలో సుశాంత్ ఆత్మను చూశానని శ్వేతా చెప్పుకొచ్చింది. మరణించిన ఏడాది వరకు కూడా తన ఆత్మకు శాంతి లభించలేదని తెలిపింది. ‘‘కైలాసంలో శివుడితో పాటు ప్రస్తుతం సుశాంత్ సంతోషంగా ఉన్నాడు. అందరినీ అక్కడి నుండే చూస్తున్నాడు. కైలాసంలో మంచి వాతావరణంలో సుశాంత్ ఉన్నాడు. అక్కడ తను పరవశించిపోతున్నాడు. మరణించిన ఏడాది వరకు సుశాంత్ అక్కడికి వెళ్లలేకపోయాడు. అప్పుడు తన ఆత్మకు శాంతి కలగలేదు. తర్వాత శాంతి లభించడంతో కైలాసానికి వెళ్లి శివుడితో కలిశాడు. కైలాసాన్ని కలలో చూడడం తప్పా నేరుగా ఎప్పుడూ వెళ్లలేదు’’ అని సుశాంత్ సింగ్ ఆత్మ గురించి వ్యాఖ్యలు చేసింది శ్వేతా. ఇది విని నిజంగా అసలు ఇలా జరుగుతుందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
పుస్తకంలో వివరంగా..
సుశాంత్‌కు ఉన్న నలుగురు అక్కల గురించి ప్రేక్షకులకు బాగా తెలుసు. ప్రస్తుతం ఎవరి వృత్తిలో వారు సెటిల్ అయిపోయి బిజీగా ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు వీరంతా సుశాంత్ సింగ్ మృతి గురించి, తనకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడుతూనే ఉంటారు. ముఖ్యంగా శ్వేతా సింగ్ అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తన తమ్ముడి గురించి తరచుగా ప్రస్తావిస్తుంటుంది. సుశాంత్ మరణించిన తర్వాత శ్వేతా.. ‘పెయిన్’ అనే పుస్తకాన్ని కూడా రాసింది. ఇందులో తన అనుభవాలను పంచుకోవడంతో పాటు ప్రేమించిన వారిని కోల్పోతే కలిగే బాధ గురించి రాసుకొచ్చింది. ఇప్పటికీ సుశాంత్‌ది ఆత్మహత్య కాదని హత్యే అని తన కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు.
Also Read: నా వయస్సు ఇంకా 23 - సమంత పోస్ట్ వైరల్, ఆమె బరువెంతో తెలిస్తే షాకవుతారు