Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Unstoppable with NBK | భార్య అల్లు స్నేహతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్... దాన్ని ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో స్వయంగా అల్లు అర్జున్ వెల్లడించారు .
Allu Arjun News | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ "పుష్ప 2" (Pushpa 2). డిసెంబర్ 5న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ గురించి ఎలాంటి వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఆయన తన భార్య స్నేహతో కలిసి ఒక సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ ను మెయింటెన్ చేస్తున్నారన్న వార్త వైరల్ అవుతుంది. అది కూడా స్వయంగా అల్లు అర్జున్ నోటి నుంచి ఈ వవిషయం రావడం విశేషం.
సాధారణంగా సెలబ్రిటీలు, వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే అభిమనులతో పాటు మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారు? సెలబ్రిటీ కపుల్ గొడవ పడినప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలని స్వయంగా సెలబ్రిటీలు చెప్తే తెలుసుకోవాలని కోరుకుంటారు. తాజాగా అల్లు అర్జున్ తన అభిమానులకు ఇలాంటి విషయంలో తాను ఫాలో అయ్యే సీక్రెట్ ను బయట పెట్టారు. అల్లు అర్జున్ ఏకంగా తన భార్యతో ఒక సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ ను మెయింటైన్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇదంతా బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న "అన్ స్టాపబుల్' షో (Unstoppable with NBK)లో జరిగింది.
భార్యతో గొడవ జరిగితే బన్నీ ఏం చేస్తాడు?
"అన్ స్టాపబుల్ సీజన్ 4"లో జరిగిన తాజా ఎపిసోడ్లో అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే. భార్యతో ఏమైనా గొడవలు జరిగినప్పుడు, లేదా ఏదైనా విషయంలో ఇద్దరు వాదించుకున్నప్పుడు ఏం చేస్తారు అనే విషయాన్ని బన్నీ బయట పెట్టారు. అలాంటివి జరిగినప్పుడు లేదా ఒకరి గురించి మరొకరు ఇష్టపడని విషయాలను మాట్లాడాలి అనుకున్నప్పుడు ప్రత్యేకంగా మెసేజ్ చేసుకుంటారట. అలా మెసేజ్ ల ద్వారా విషయాన్ని కన్వె చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ ని ఇద్దరూ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారట. కాగా అల్లు అర్జున్ 2011లో స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఈ 13 ఏళ్ల వైవాహిక బంధంలో అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి జంట ఎంతో అన్యోన్యంగా ఉండడమే కాకుండా, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇక అయాన్, అర్హ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తాజా ఎపిసోడ్లో వీరిద్దరు కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ షోలో అల్లు అర్జున్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం "అన్ స్టాపబుల్ సీజన్ 4"లో అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ ఇప్పుడు ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
మరోవైపు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ "పుష్ప" సీక్వెల్ "పుష్ప 2" గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ఎక్కువ రోజులు లేకపోవడంతో ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్లను షురూ చేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ భారీ సంఖ్యలో వ్యూస్ ను రాబట్టి, సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమా కచ్చితంగా 1000 కోట్లు కొల్లగొడుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు అల్లు అభిమానులు.
Also Read: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే