Christmas 2024 Movie Releases Telugu: క్రిస్మస్ బరిలో ఫ్లాప్స్ నుంచి బయట పడేది ఎవరు? హిట్టు కొట్టేది ఎవరు? - అన్నీ క్రేజీ సినిమాలే
Upcoming Telugu Movies: డిసెంబర్ 5న 'పుష్ప 2' విడుదల అవుతోంది. ఆ తర్వాత రెండు వారాలు కొత్త సినిమాలు వచ్చే అవకాశం తక్కువ. మళ్లీ క్రిస్మస్ బరిలో కొన్ని క్రేజీ సినిమాలు వస్తున్నాయి.
ఫెస్టివల్, హాలిడేస్ సీజన్ అంటే థియేటర్లలో మినిమమ్ మూడు నాలుగు సిన్మాలు విడుదల కావడం కామన్. కానీ, ఈసారి క్రిస్మస్ సీజన్ కాంపిటీషన్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. ఒకట్రెండు కాదు... ఏకంగా ఎనిమిది సినిమాలు రిలీజ్ డేట్స్ మీద కర్చీఫ్స్ వేశాయి. అందులో ఐదు సినిమాలు తెలుగులో తీసినవి ఉన్నాయి. ఆయా సినిమా హీరోలు అందరికీ హిట్టు కావాలి.
నితిన్... మాచెర్ల, ఎక్స్ట్రా తర్వాత!
డిసెంబర్ 25... కరెక్టుగా క్రిస్మస్ రోజున థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమా 'రాబిన్ హుడ్' (Robinhood Movie 2024 Release Date). అందరి కంటే ముందుగా ఈ సీజన్ మీద కర్చీఫ్ వేసిన సినిమా కూడా ఇదే! అయితే... 'గేమ్ ఛేంజర్' వస్తే వెనక్కి తగ్గాలని అనుకున్నారు. కానీ, రామ్ చరణ్ సినిమా సంక్రాంతికి వెళ్లడంతో క్రిస్మస్ బరిలో దిగుతున్నారు నితిన్.
'మాచెర్ల నియోజకవర్గం', 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' ఫ్లాప్స్ తర్వాత నితిన్ చేసిన సినిమా 'రాబిన్ హుడ్'. అందువల్ల, ఆయనకు హిట్టు అవసరం. అటు హీరోయిన్ శ్రీ లీలకు కూడా! 'భీష్మ' వంటి హిట్ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆయన చేసిన సినిమా కావడంతో హోప్స్ ఉన్నాయి. ఆ హిట్ మేజిక్ రిపీట్ అవుతుందని! మరి, రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
భైరవం... ఒక్క సినిమాతో ముగ్గురు!
ఆల్మోస్ట్ నాలుగేళ్ల విరామం తర్వాత 'భైరవం'తో బెల్లకొండ సాయి శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సంక్రాంతి 2021కి 'అల్లుడు అదుర్స్'తో సాయి శ్రీనివాస్ థియేటర్లలోకి వచ్చారు. అది ఆశించిన విజయం ఇవ్వలేదు. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లారు. హిందీలో 'ఛత్రపతి' రీమేక్ చేశారు. అది డిజాస్టర్ అయ్యింది. ఈ 'భైరవం'తో మళ్ళీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇది ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఇందులో నారా రోహిత్, మంచు మనోజ్ కూడా ఉన్నారు. ఆ ఇద్దరూ ఈ సినిమాతో హిట్ మీద కన్నేశారు.
'ప్రతినిధి 2'తో రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే, అది ఫ్లాప్ అని ఆయన ఆ మధ్య చెప్పారు. మంచు మనోజ్ సినిమా చేసి చాలా రోజులైంది. విరామానికి ముందు ఆయన చేసినవి సక్సెస్ కాలేదు. అందుకని, వాళ్లిద్దరికీ ఈ సినిమా సక్సెస్ కావడం చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 20న 'భైరవం' రిలీజ్ కానుంది. తమిళ హిట్ 'గరుడన్'కు ఇది రీమేక్.
బచ్చల మల్లి... అల్లరోడికి ముఖ్యం మరి!
'నాంది'తో 'అల్లరి' నరేష్ రూటు మార్చారు. సీరియస్ రోల్, సినిమా ఆయనకు సక్సెస్ అందించింది. 'ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం', 'ఉగ్రం' సినిమాలు భారీ హిట్స్ కాకుండా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అయితే... 'నా సామిరంగ', 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఆయనకు హిట్ అవసరం పడింది. 'బచ్చల మల్లి'తో డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తున్నారు. అదీ సంగతి! ఇప్పుడు హీరోల లాస్ట్ సినిమాల రిజల్ట్స్ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. పైగా, ఈ సినిమాలు అన్నిటికీ మంచి క్రేజ్ నెలకొంది.
Also Read: ఎవరీ రియా? అసలు, ఈ అమ్మాయి ఎందుకు అంత పాపులర్ అవుతుందో తెలుసా?
ప్రియదర్శి తనకు సూటయ్యే కథలు వచ్చినప్పుడు హీరోగా సినిమాలు చేస్తారు. నభా నటేష్, ఆయన చేసిన 'డార్లింగ్' అనుకున్నంత హిట్ కాలేదు. దాంతో 'సారంగపాణి జాతకం' హీరోగా ఆయన కెరీర్‌కు కీలకం. అది డిసెంబర్ 20న విడుదల కానుంది. ప్రియదర్శితో పాటు డిసెంటర్ 20న 'కబ్జా' ఫ్లాప్ తర్వాత ఉపేంద్ర 'యూఐ' అంటూ వస్తున్నారు. వాళ్లకూ హిట్ కావాలి. క్రిస్మస్ బరిలో వస్తున్న సినిమాల్లో 'విడుదల: పార్ట్ 2' ఒకటి. అందులో విజయ్ సేతుపతి హీరో. 'మహారాజా' సక్సెస్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా ఇది. దాంతో పాటు హాలీవుడ్ సినిమా 'ముఫాసా: ది లయన్ కింగ్' సైతం డిసెంబర్ 20న విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అనిరుద్ సంగీతంలో సితార - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మించిన 'మేజిక్' డిసెంబర్ 21న విడుదల కానుంది.