అన్వేషించండి

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసుల నోటీసులు - అంతర్యుద్ధం రాబోతోందని మాజీ ఎంపీ ఆగ్రహం

Andhra Pradesh: గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు సహకరించడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Ysrcp Leader Gorantla Madhav: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు.   మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి ఐదో తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఓ  పోక్సో కేసులో బాధితురాలి పేర్లను బయట  పెట్టడమే కాకుండా అసభ్యంగా మాట్లాడారు. ఈ మాటల వీడియోలతో సహా వాసిరెడ్డి పద్మ గత నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. 

గోరంట్ల మాధవ్ సీఐగా పని చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనంతపురంలో సీఐగా పని చేస్తున్న సమయంలో జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై చేసిన కొన్ని వ్యాఖ్యలతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. పోలీసు అధికారుల సంఘం అని చెప్పుకుని ఆయన మీసాలు మెలేసి..తొడలు కొట్టి హైలెట్ అయ్యారు. ఆయన సామాజికవర్గం కూడా కలసి రావడంతో జగన్ పిలిచి వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. వైసీపీ గాలిలో ఎంపీగా గెలిచారు. 

అయితే ఆయన పని తీరు మాత్రం అత్యంత వివాదాస్పమయింది. ఓ సారి ఆయన అసభ్య వీడియోలు వెలుగులోకి వచ్చాయి. పలుమార్లు ఆయన రాజకీయ ప్రత్యర్థులపై దూకుడైన విమర్శలు చేశారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఇటీవల కూడా చంద్రబాబును చంపేస్తామన్నట్లుగా మాట్లాడి వివాదాస్పదం అయ్యారు. అయితే ఈ విషయాల్లో ఆయనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు కనీ.. పోలీసు అధికారి అయి ఉండి ఓ పోక్సో కేసులో బాధితురాలి ఐడెంటీటీ  బయట పెట్టకూడదని తెలిసి కూడా ఆయన బయట పెట్టారు. అప్పట్లోనే దీనిపై విమర్శలు వచ్చాయి. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. 

మరో వైపు  ఈ నోటీసులను అందుకున్న గోరంట్ల మాధవ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో భావ ప్రకటన  స్వేచ్చ లేదని.. ప్రశ్నించిన వారందరిపై అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. త్వరలో రాష్ట్రంలో అంతర్యుద్ధం వస్తుందని హెచ్చరించారు. తనకు ఈ నోటీసులు ఇప్పుడే ఇచ్చారని.. ఐదో తేదీన విచారణకు వెళ్లడంపై ఆలోచిస్తానన్నారు.న్యాయ నిపుణుల సలహా తీసుకుంటానని .. వారి సలహా మేరకు నడుచుకంటానన్నారు. విచారణ తేదీ మార్చాలని కూడా అడుగుతానన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని.. రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలను ప్రశ్నించినందుకే తనపై కేసులు పెడుతున్ారని ఆరోపించారు.       

గోరంట్ల మాధవ్ పోలీసు అధికారి. పోలీసులు ఇచ్చిన నోటీసులకు విచారణకు హాజరు కాకపోతే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఈ కేసులో అరెస్టు చేయకుండా కోర్టుకు వెళ్లడం లేదా.. మరో న్యాయపరమైన అవకాశాలను ఆయన పరిశీలించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆయన అత్యంత దారుణంగా మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటాయి. దాంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.          

Also Read:  వియ్ స్టాండ్ విత్ పోసాని అంటున్న వైసిపీ- సిగ్గుందా అని ప్రశ్నిస్తున్న టీడీపీ, జనసేన

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget