Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
ఇంగ్లాండ్ టీమిండియా మధ్య లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌కు ముందు ఊహించని భారీ షాక్ తగిలింది. సిరీస్ డిసైడర్ అయిన ఈ క్రూషియల్ మ్యాచ్‌కు స్టార్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా కంప్లీట్‌గా దూరమయ్యాడు. కార్డిఫ్‌లో జరిగిన సెకండ్ వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు సుందర్‌కు రైట్ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీ కావడంతో, అతను కనీసం రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కన్ఫర్మ్ చేసింది.
సిరీస్ ప్రెజెంట్ 1-1 తో ఈక్వల్‌గా ఉన్న టైమ్‌లో.. సుందర్ లాంటి కీ ప్లేయర్ దూరం కావడం ఇండియాకు పెద్ద మైనస్సే. అయితే, అతని ప్లేస్‌ను రీప్లేస్ చేస్తూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను టీమ్ మేనేజ్మెంట్ రంగంలోకి దించింది.
హర్ష్ దూబేకు ఇది చాలా పెద్ద గోల్డెన్ ఛాన్స్. ఈ ఏడాది అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే డెబ్యూ మ్యాచ్‌లోనే 3 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన దూబే, రీసెంట్ గా శ్రీలంకలో జరిగిన ఇండియా ఏ సిరీస్‌లోనూ బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ దుమ్మురేపాడు. అంతేకాదు, జింబాబ్వేతో హరారే వేదికగా ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్‌లోనూ అతను భారత జట్టు తరఫున ఆడనున్నాడు.
ట్రెండింగ్ వార్తలు






















