Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Salman Khan Look : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా ఓ ఈవెంట్‌లో కనిపించగా ఆ లుక్ వైరల్ అవుతోంది. బరువు తగ్గి సన్నగా కనిపించడంతో ఆయనకు ఏమైంది? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Salman Khan Shocking Look In Mumbai Event : బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ లుక్ వైరల్ అవుతోంది. ముంబైలో ఓ ఈవెంట్‌లో కనిపించిన ఆయన సన్నగా... కొంచెం అన్ ఈజీగా కనిపించారు. దీంతో ఆయనకు ఏమైంది? అంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అలా మారిపోయారేంటి?
ముంబైలోని ఓ ఐటీ సర్వర్ రూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన సల్మాన్ ఖాన్ బరువు తగ్గి, సన్నగా కనిపించారు. ముఖంలో గ్లో కాస్త తగ్గడంతో పాటు ఏదో కాస్త అనారోగ్యంతో ఉన్నట్లుగా ఆ వీడియోలో ఉంది. నడిచేటప్పుడు కాస్త నీరసంగా కనిపించారు. ఈ వీడియో వైరల్ కాగా... సల్మాన్ ఖాన్‍కు ఏమైంది? అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఎప్పుడూ కండలు తిరిగిన దేహంతో ఫిట్‌నెస్‌గా ఉండే సల్మాన్... ఇలా మారిపోయారేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'సల్మాన్ ఖాన్‌కు ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా? ఏదైనా మూవీ కోసం డైట్ ఫాలో అవుతున్నారా? బరువు కావాలనే తగ్గారా?' అంటూ పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి దీనిపై హీరో టీం ఎలాా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.
What happened to Salman Khan?? At first I thought it's not him but saw shera too there
— Gagan Choudhary (@trigguuuu) July 19, 2026
He is ageing like Dharmendra. pic.twitter.com/u52EZHx4KX
ముంబైలోని స్లమ్ రీహాాబిలిటేషన్ అథారిటీ కార్యాలయాన్ని సందర్శించిన సల్మాన్ ఖాన్... ఐటీ సర్వర్ రూమ్ ప్రారంభించడం సహా... లబ్ధిదారులకు కొత్త ఇళ్ల తాళాలు అందించారు. ఇక సినిమాల విషయానికొస్తే... ఆయన ప్రస్తుతం మాతృభూమి సినిమాలో నటిస్తున్నారు. భారత్ చైనా సరిహద్దులో గల్వాన్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. ఈ మూవీకి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా... చిత్రాంగద సింగ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడి కానుంది.
ఆ తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీలో సల్మాన్ సరసన నయనతాార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును SVC బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు






















