RRB Para Medical Exam: ఆర్‌ఆర్‌బీ పారా మెడికల్ పరీక్ష తేదీలు వెల్లడి, అడ్మిట్ కార్డు విడుదల, పరీక్ష తేదీలు ఇవే
RRB: రైల్వేల్లో పారా-మెడికల్ పోస్టుల పరీక్షల తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 28 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

RRB Para Medical Exam Dates: రైల్వేశాఖలో పారా-మెడికల్(Para Medical) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష(CBT)ల తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 28 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షతేదీకి నాలుగురోజుల ముందునుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష సమయంలో అభ్యర్థుల నుంచి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు తీసుకుంటారు. కాబట్టి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఆధార్ ప్రింట్ కాపీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.
అక్రమంగా ఎవరైనా రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ హామీలతో అభ్యర్థులను తప్పుదారి పట్టించే మోసపూర్తి వ్యక్తులపట్ట జాగ్రత్త వహించాలని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు హెచ్చరించింది. RRB ఎంపికలు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆధారంగా ఉంటాయి మరియు నియామకాలు అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మాత్రమే జరుగుతాయని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్ల పరిధిలో వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి గతేడాది ఆగస్టులో రైల్వే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 1,376 పారా మెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పూర్, అజ్‌మేర్, గోరఖ్‌పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, సికింద్రాబాద్, బిలాస్‌పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం తదితర రీజియన్లలో పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రొఫెషనల్ ఎబిలిటీ 70 ప్రశ్నలు-70 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ అరిథ్‌మెటిక్ & జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ సైన్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
పోస్టుల వివరాలు..
➥ విభాగాల వారీగా ఖాళీలు : 1376
➥ డైటీషియన్ (లెవల్-7) పోస్టులు : 05 పోస్టులు
➥ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు : 713 పోస్టులు
➥ అడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు : 04 పోస్టులు
➥ క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టులు : 07 పోస్టులు
➥ డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు : 03 పోస్టులు
➥ డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు : 20 పోస్టులు
➥ హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-III పోస్టులు : 126 పోస్టులు
➥ ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ పోస్టులు : 27 పోస్టులు
➥ పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు : 02 పోస్టులు
➥ ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II పోస్టులు : 20 పోస్టులు
➥ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు : 02 పోస్టులు
➥ క్యాథ్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు : 02 పోస్టులు
➥ ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టులు : 246 పోస్టులు
➥ రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టులు : 64 పోస్టులు
➥ స్పీచ్ థెరపిస్ట్ పోస్టు : 01 పోస్టులు
➥ కార్డియాక్ టెక్నీషియన్ పోస్టులు: 04 పోస్టులు
➥ ఆప్టోమెట్రిస్ట్ పోస్టులు: 04 పోస్టులు
➥ ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 13 పోస్టులు
➥ ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టులు: 94 పోస్టులు
➥ ఫీల్డ్ వర్కర్ పోస్టులు: 19 పోస్టులు





















