Telangana Latest News: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి విచిత్ర అనుభవం! ప్రధాని మోదీ హర్ట్ అయ్యారా?
Telangana Latest News: దేశంలో మరే ముఖ్యమంత్రికి ఎదురుకాని అనుభవం తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి ఎదురైంది. తాాజాగా ప్రధానితో భేటీలో రివర్స్ ప్రశ్నలతో మోదీ ఇరుకున పెట్టడానికి కారణం అదేనా అనిపిస్తుంది.

Telangana Latest News: ప్రధాని నరేంద్ర మోదీ తీరు విలక్షణం, విభిన్నం కూడా , అందుకే ఆయన ఏం చేసినా సంచలనమే. ప్రపంచ దేశాధినేతలు సైతం మోదీ అంటే అందుకే ఇష్టపడారు. భారత్‌కు గతంలో పనిచేసిన ఇతర ప్రధానులతో పోల్చినప్పుడు ఎక్కువ మంది విదేశీ ప్రధానులతో సత్సంబంధాలున్న నేత, ముఖ్యంగా ట్రంప్ వంటి ఛాణిక్యుడి మనసు చూరగొన్న ప్రధాని అంటే ఆ ఖ్యాతి నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. దేశరాజకీయాల్లో సైతం ప్రతిపక్షాన్ని ముప్పు తిప్పలు పెట్టి, రాష్ట్రాల వారీగా అధికారం హస్తగతం చేసుకోవడం, కమలం ఖ్యాతిని పెండంలో మోదీ రూటే సపరేటు. అంతటి అపరచాణిక్యుడు నరేంద్రమోదీ. అటువంటి నరేంద్ర మోదీని ఎవరైనా విమర్శిస్తే, ఏముంది లైట్ తీసుకుంటారు, పెద్దగా పట్టించుకోరు, కేంద్ర మంత్రులు, పార్టీ కోర్ టీమ్, ముఖ్యనేతలు మాత్రమే మోదీని విమర్శించిన వారిని కౌంటర్లతో ఉతికి ఆరేస్తారు అని అంతా అనుకుంటారు. బహుషా ఇప్పటివరకూ అదే జరిగింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం ఎక్కడో తేడా కొట్టింది అనేది తాజాగా ఢిల్లీలో మోదీతో రేవంత్ రెడ్డి భేటీ తరువాత జరిగిన పరిణామాలను, భేటీలో మోదీ వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా అర్దమవుతోంది.
సాధారణంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశప్రధానితో భేటీ అయినప్పుడు,ఆయా రాష్ట్రాల సమస్యల చిట్టాతో వెళ్తారు. తమకు పెండింగ్ ప్రాజెక్టులు, అభివృద్దికి నిధుల విడుదల చేసి సహకరించాలని కోరతారు. మోదీ తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇస్తుంటారు. ఇదీ ప్రతీ భేటీలోనూ సాధారణంగా జరిగేది. రేవంత్ రెడ్డి కూడా అలా అనుకునే ఢిల్లీ వెళ్లారు, మోదీని కలిశారు. మెట్రో ఫేస్ టూ విస్తరణ, మూసీ పునరజ్జీవం, ట్రిపుల్ ఆర్ ఇలా ఓ 5 ప్రధాన డిమాండ్‌లను మోదీ ముందుంచారు. నిధులు విడుదల చేయాలని కోరారు. తనకూ రోటీన్ సమాధానం, పాజిటివ్ రియాక్షన్‌తోపాటు గట్టి హామీ వస్తుందని భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మోదీ అక్కడ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. రేవంత్ వినతులు తీసుకున్న మోదీ , తాను కూడా రేవంత్ రెడ్డిని కొన్ని ప్రశ్నలు వేశారు. తెలంగాణలో ప్రధాని ఆవాజ్ యోజన పథకం ఎందుకు అమలు కావడంలేదు? మార్చి 31 నాటికి నివేదిక కావాలని రేవంత్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఈఎస్‌ఐ ఆసుపత్రికి 150 కోట్ల నిధులు మీరు చెల్లించాలని రేవంత్‌ను కోరారు. ఇలా రేవంత్ రెడ్డికి ఏకంగా ఆరు సూచనలతో ఊహించని షాకిచ్చారు ప్రధాని మోదీ.
Also Read: PMకు తెలంగాణ CM ఏం వినతులు చేశారు? రేవంత్‌కు మోదీ చేసిన సూచన ఏంటి?
ఇంతలా ఎందుకు సీన్ రివర్స్ అయ్యింది అంటే... మోదీతో భేటీకి ముందు సరిగ్గా ఓ పది రోజులు క్రితం రేవంత్ చేసిన వ్యాఖ్యలే కొంపముంచాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈనెల 15వ తేదీ గాంధీభవన్‌లో కులగణన పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే మోదీని వ్యక్తిగతంగా టచ్ చేశారు. మోదీ ఒరిజినల్ బిసి కాదు, కన్వర్టెడ్ బిసి అంటూ విమర్శలతో చెలరేగిపోయారు. లీగల్ మార్గాల్లో బిసి కులంలోకి మారారని విమర్శించారు. ఇప్పటికీ మోదీది అగ్రకుల వ్యక్తిత్వమే అంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఓ ముఖ్యమంత్రి, ఏకంగా ప్రధాని కులంపై చేసి విమర్శలు రాజకీయ దుమారం రేపాయి. బిజెపి నేతలు కౌంటర్లు ఇచ్చారు. కానీ మోదీ మనస్సును రేవంత్ గాయపరిచారు. తనను కులం పేరుతో దూషించిన రేవంత్‌ను మోదీ ఎందుకు వదిలేస్తారు. ఇదిగో ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా రివర్స్ అటాక్ తప్పదు. రేవంత్ వ్యాఖ్యలను మోదీ పర్సనల్‌గా తీసుకున్నారు కాబట్టే మొదటిసారి తనను కలిసిన ఓ ముఖ్యమంత్రికి ఏం చేయాలో టార్గెట్ పెట్టి మరీ వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడితో సరిపెడతారా లేక రేవంత్ ప్రభుత్వం వర్సెస్ మోదీ సూచనలు ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతాయా అనేది వేచిచూడాలి.
Also Read: వివాదాలను పరిష్కరించాలని ఎమ్మార్ విజ్ఞప్తి - లీగల్ ఏజెన్సీకి రేవంత్ ఆమోదం




















