అన్వేషించండి

Anantapur Chandrababu Naidu Speech: అన్నీ అంశాలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడు - సూపర్ హిట్ సభలో జగన్‌కు చంద్రబాబు కౌంటర్

Super Six Meeting: మెడికల్ కాలేజీలు సహా అన్ని అంశాలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని చంద్రబాబు జగన్‌కు సవాల్ చేశారు. వైసీపీ ఉనికి కోల్పోయిందని అనంతపురంలో నిర్వహించిన సభలో తేల్చేశారు.


Chandrababu challenges Jagan:   "మెడికల్ కాలేజీలంటే జగన్‌కు తెలియదు. భూమి ఇస్తే మెడికల్ కాలేజీ పూర్తవుతుందని ఆయన అనుకుంటున్నారు. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడంతో ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పినా, ఒక్కటి మాత్రమే పూర్తయిం.  అసెంబ్లీకి రండి, మెడికల్ కాలేజీలపై చర్చిద్దాం" అంటూ జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు. ఉదయం జగన్ ప్రెస్‌మీట్‌లో చేసిన విమర్శలన్నింటికీ చంద్రబాబు సభలో కౌంటర్ ఇచ్చారు. 

2024 ఎన్నికల్లో కూటమిసాధించిన విజయం చరిత్రాత్మకమని, ఈ సభ ఓట్ల కోసం కాదని, ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు ప్రజలకు చెప్పేందుకే నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  "గత పాలకులు ప్రజా వేదికను కూల్చివేయడంతో విధ్వంసం మొదలైంది. అవినీతి, అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారు. వచ్చిన పెట్టుబడులను తరిమేసి, పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా చేశారు. దాదాపు 93 పథకాలను నిలిపివేసి, పేదలు, మధ్యతరగతి జీవితాలను నాశనం చేశారు" అని  మండిపడ్డారు.   "సూపర్ సిక్స్ అంటే హేళన చేశారు. పెన్షన్ల పెంపు అసాధ్యమన్నారు, తల్లికి వందనం పథకాన్ని ట్రోల్ చేశారు, మెగా డీఎస్సీ, దీపం, ఉచిత బస్సు పథకాలు అమలు కావన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసింది" అని ఆయన స్పష్టం చేశారు.

 2024 ఎన్నికల్లో 57% ఓటర్లు పాల్గొని, 94% స్ట్రైక్ రేట్‌తో కూటమికి 164 సీట్లు ఇచ్చి, ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారన్నారు.  "సూపర్ సిక్స్ పథకాలు పేదలు, మధ్యతరగతి జీవితాలను మార్చేందుకు రూపొందించాము. పెన్షన్లు, తల్లికి వందనం, మెగా డీఎస్సీ, దీపం, ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి" అని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని..  కూటమి ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని చంద్రబాబు వివరించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా 5.60 కోట్ల భోజనాలు అందించామని, దీపం-2 పథకం ద్వారా 2.45 కోట్ల సిలిండర్లు ఉచితంగా ఇచ్చామని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 47 లక్షల రైతులకు రూ.3,173 కోట్లు అందించామని ఆయన వెల్లడించారు.

ఒక్క రైతుకూ యూరియా కొరత రాకుండా తాను చూసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. ఎంత యూరియా కావాలో అంతే వాడండంటూ రైతులకు సూచించారు. కేంద్రాన్ని అడిగిన వెంటనే యూరియా ఇచ్చిందని ఆర్ధిక కష్టాలున్నా.. అండగా నిలిచాం కాబట్టే ‘అన్నదాత సుఖీభవ’ సూపర్ హిట్ చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చామని .. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా ప్రతీ ఏటా మూడు సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.1,704 కోట్లు ఖర్చు చేసి.. 2.45 కోట్ల సిలిండర్లు మహిళలకు ఇచ్చామని తెలిపారు. ప్రతీ ఇంటా వెలుగులు నింపాం కాబట్టే.. దీపం పథకం సూపర్ హిట్ అయిందని తెలిపారు.  

వైసీపీ కార్యాలయాలను మూసి వేసి..సోషల్ మీడియాలో విమర్శలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. మండిపడ్డారు.  రప్పా రప్పా అని హెచ్చరికలు డారీ చేస్తున్నారని అలాంటి వారిని వదిలి పెట్టేది లేదని చెబుతున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget