Chandrababu: దసరా రోజున ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు - సూపర్ సిక్స్ సభలో చంద్రబాబు సంచలన ప్రకటన
Chandrababu Auto Drivers: దసరా రోజున ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభించినప్పుడు ఆటోడ్రైవర్లకు సాయం చేస్తామని చెప్పారు.

Chandrababu Naidu announces Rs 15,000 to auto drivers on Dussehra: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' సభలో భాగంగా అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం (స్త్రీ శక్తి) అమలు వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి ప్రభావితం కాకుండా చూసేందుకు ప్రత్యేక సాయం అందిస్తామని గతంలో ప్రకటించారు. ఆ మేరకు ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు అందించాలని నిర్ణయించారు.
అనంతపురంలో సూపర్ సిక్స్..సూపర్ హిట్ సభ
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్న ఈ సభలో, కూటమి ప్రభుత్ వం గత 15 నెలల్లో సాధించిన విజయాలను, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఆర్థిక సాయం ప్రకటన ఆటో డ్రైవర్లలో ఉత్సాహాన్ని నింపింది.
ఆటో డ్రైవర్లకు దసరా రోజున పదిహేను వేలు
చంద్రబాబు మాట్లాడుతూ, "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి) పథకం ఆగస్టు 15, 2025 నుంచి అమలులోకి వచ్చింది. ఈ పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయం ప్రభావితం కావచ్చనే ఆందోళనను మేము గమనించాము. అందుకే, ఈ దసరా సందర్భంగా ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందజేస్తామని నిర్ణయించాము. ఈ సాయం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించి, జీవనోపాధిని సురక్షితం చేస్తాం" అని పేర్కొన్నారు.
స్త్రీశక్తి పథకం వల్ల ప్రభావితమవుతారని సాయం
ఈ పథకం కింద, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఆటో డ్రైవర్లు ప్రయోజనం పొందనున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం 'వాహన మిత్ర' పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10,000 సాయం అందించగా, కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.15,000కు పెంచి, దసరా సందర్భంగా అందజేయనుంది. ఈ నిర్ణయం ఆటో డ్రైవర్లకు ఊరటనిచ్చే అంశంగా నిలిచింది.
అలాగే, స్త్రీ శక్తి పథకం కింద 2.62 కోట్ల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్‌లోని 74% ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందుతున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఈ పథకం రూ.1,942 కోట్ల వ్యయంతో అమలవుతోందని, దీని ద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, గౌరవం పెరుగుతుందని ఆయన అన్నారు. "మహిళలు ఉచితంగా ప్రయాణించే ఈ సౌకర్యం వారి విద్య, ఉపాధి, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవడం మా బాధ్యత" అని చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలుగు తమ్ముళ్ళ స్పీడు..
— Telugu Desam Party (@JaiTDP) September 10, 2025
జన సైనికుల జోరు..
కమలదళ ఉత్సాహం..
అనంత దద్దరిల్లిపోతుంది... #Super6SuperHitEvent#Super6SuperHit#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu pic.twitter.com/nDqU5n383e





















