Thar Accident : అయిపాయే ! థార్ కొన్నారు ..నిమ్మకాయ తొక్కించారు ! షెడ్డుకెళ్లిపోయింది !
New Thar Car Falls: షోరూం రెండో అంతస్తు నుంచి కొత్త థార్ కారు కింద పడిపోయింది. నిమ్మకాయ తొక్కించాలన్న సెంటిమెంట్ కారణంగా ఇలా జరిగింది.

Thar car falls from second floor: కొత్త కారు కొన్నప్పుడు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. అలాంటి సెంటిమెంట్లలో ఒకటి నిమ్మకాయలను తొక్కించడం. నిమ్మకాయలను తొక్కిస్తున్నప్పుడు ఓ కారు..రెండో అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. అప్పుడే డెలివరి తీసుకుంటున్న వారి గుండెల్లో రాయి పడింది.
ఢిల్లీలోని ఓ మహీంద్రా షోరూమ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన మహీంద్రా థార్ వాహనం ఆచారం సందర్భంగా ఊహించని విధంగా షోరూమ్ గాజు తలుపులను ఢీకొని బయటకు దూసుకెళ్లిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. నమ్మకాల్లో భాగంగా నిమ్మకాయను చక్రం కింద నలపడం ద్వారా వాహనానికి శుభం జరగాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా వాహనం ముందుకు కదలడంతో రెండో అంతస్తు నుచి కింద పడిపోయింది.
😂 दिल्ली का नींबू टेस्ट → Thar ने दी सीधी छलांग पहली मंज़िल से!
— Durgesh Shukla (@mydurgeshshukla) September 9, 2025
लक्ष्मीनगर में महिला नई Thar लेने आई 🚙
रस्म निभाने के लिए गाड़ी पर बैठकर नींबू फोड़ना चाहा 🍋
…और फिर Thar सीधा पहली मंज़िल से नीचे गिर गई! 😳
👉 महिला गंभीर रूप से घायल, गाड़ी भी चकनाचूर।#Delhi #TharCrash… pic.twitter.com/pJJFrjecLL
కస్టమర్ నిమ్మకాయను చక్రం కింద ఉంచే సమయంలో వాహనం గేర్‌లో ఉండి, యాక్సిలరేటర్‌పై అనుకోకుండా ఒత్తిడి పడటం వల్ల వాహనం ముందుకు దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు. స్థానికులు , షోరూమ్ సిబ్బంది ఈ ఘటనతో ఆశ్చర్యపోయారు. షోరూమ్ అద్దాలు ధ్వంసమైనప్పటికీ, గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది, దీనిపై నెటిజన్లు హాస్యాస్పదంగా స్పందిస్తూ, "నిమ్మకాయ ఆచారం కంటే వాహన గేర్‌ను తనిఖీ చేయడం ముఖ్యం" అంటూ వ్యాఖ్యలు చేశారు .
Woman’s lemon-crushing ritual sends Thar crashing off showroom floor in Delhi
— Ashwini Shrivastava (@AshwiniSahaya) September 9, 2025
What was meant to be a puja ritual turned into a shocking accident in Delhi when a woman, while trying to crush lemons under the tyre of a brand-new Thar, revved too hard. The SUV smashed through the… pic.twitter.com/eb4uijsJyW
మహీంద్రా సంస్థ ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, షోరూమ్ యాజమాన్యం ఈ ఘటనను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఈ కారును అక్కడి నుంచి షెడ్డుకు తీసుకెళ్లి బాగు చేయించుకుని ఇంటికి తీసుకెళ్లాలి. ఇప్పుడు దానికి ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అన్నదానిపైనా చర్చ జరుగుతోంది. ఇన్సూరెన్స్ కట్టేసి ఉంటారు కాట్టి వస్తుందని కొందరంటున్నా.. ప్రమాదం జరిగిన తీరు .. ఇంకా షోరూం బయటకు రాలేదు కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదని కొంత మంది అంటున్నారు.





















