అన్వేషించండి

Super Six Super Hit Sabha Pawan: ప్రజల ఆశలను నెరవేర్చేలా కూటమి పాలన - అనంతపురం సూపర్ సిక్స్ సభలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన చేస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఆయన ప్రసంగించారు.

Pawan Kalyan Speech in Anantapur:  "ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చుతున్నాం. మా ప్రభుత్వం ప్రజలకు చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా మరచలేదు. ఈ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నాయి" అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అనంతపురంలోని  ఇంద్రప్రస్థ మైదానంలో నిర్వహించిన 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' బహిరంగ సభలో ప్రసంగించారు.  కూటమి ప్రభుత్వం  ఏర్పాటు చేసిన ఈ భారీ సభకు భారీగా ప్రజలు, కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. 

ఈ సభలో పవన్ కల్యాణ్, కూటమి ప్రభుత్వం 15 నెలల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాయలసీమ అభివృద్ధి గురించి వివరించారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పెట్టుబడులు ఆకర్షించడం, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రశంసించారు.  రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కల్యాణ్,  రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రాంతం ఎప్పటికీ వెనుకబడినది కాదు. మేము దీన్ని రత్నాల సీమగా మలిచి, ప్రజలకు సమృద్ధి, ఉపాధి అవకాశాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.   ఈ లక్ష్యానికి పెట్టుబడులు ఆకర్షించడం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధి, నీటి సమస్యల పరిష్కారం మొదలైన కార్యక్రమాలపై దృష్టి సారించామన్నారు. 

 "ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందుతారన్నారు. మా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని మొదటి ప్రాధాన్యతగా పెట్టుకుందని  పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజలు కోరుకున్న పాలనే కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మేము ప్రజలతో పాటు పాలిస్తున్నాం, వారి సమస్యలకు పరిష్కారాలు  చూపిస్తామని ఆయన అన్నారు. యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.   "యువత, మహిళలు, రైతులు భవిష్యత్ కోసమే సంక్షేమ పథకాలు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం, రైతులకు సబ్సిడీలు, నీటి సౌకర్యాలు అందిస్తున్నాం. ఈ పథకాలు రాబోయే తరాలకు శాశ్వత ప్రయోజనం కలిగిస్తాయి" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

"ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. ఈ సభల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికలు, ప్రజల సమస్యలు చర్చించి పరిష్కరిస్తున్నాం. పంచాయతీలకు ఎక్కువ నిధులు కేటాయించి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాం" అని ఆయన తెలిపారు.  "కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని ఆకుపచ్చలు చేస్తాం, వాతావరణ సమతుల్యతను కాపాడతాం. ప్రతి పౌరుడు ఈ ప్రయత్నంలో పాల్గొనాలి" అని పిలుపునిచ్చారు. 

 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
Advertisement

వీడియోలు

Tamilnadu Deputy CM Udhayanidhi Stalin Full Speech | ABP Southern Rising Summit 2025 లో ఉదయనిధి స్టాలిన్ పూర్తి ప్రసంగం | ABP Desam
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Dravidian Algorithm ABP Southern Rising Summit 2025 | ద్రవిడయన్ ఆల్గారిథంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్
Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin Speech | ABP Southern Rising Summit 2025 లో తమిళనాడు గవర్నర్ పై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఫైర్  | ABP Desam
ABP Director Dhruba Mukherjee Speech | ABP Southern Rising Summit 2025 లో ప్రారంభోపన్యాసం చేసిన ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ | ABP Desam
ABP Southern Rising Summit 2025 Begins | ప్రారంభమైన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025 | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు! టోకెన్లు ఎలా తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇవిగో!
Telangana Future City: రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం -  కాని మాస్టర్ ప్లానేది?
రెండేళ్లలో అడుగు ముందుకు పడని ఫ్యూచర్ సిటీ - అక్కడే పెట్టుబడులకు సీఎం ప్రోత్సాహం - కాని మాస్టర్ ప్లానేది?
Ayodhya Ram Mandir : అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
అంతా రామమయం! అయోధ్య రామమందిరం శిఖరంపై ధర్మధ్వజం ఎగురవేసిన తర్వాత మోదీ ఏమన్నారంటే!
Andhra Pradesh News: మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
మెరుగైన పౌర సేవల కోసం ఏపీ ప్రభుత్వం అవేర్ యాప్.. 42 అంశాలపై సమాచారం
నెలకు 1000 km డ్రైవ్‌ చేసే సీనియర్‌ సిటిజన్లకు రూ.15 లక్షల్లో పర్‌ఫెక్ట్‌ ఆటోమేటిక్‌ కార్‌ - దీనిని మిస్‌ అవ్వొద్దు!
సీనియర్‌ సిటిజన్లు ఈజీగా హ్యాండిల్‌ చేయగల సేఫ్‌, ఆటోమేటిక్‌ కార్‌ - రూ.15 లక్షల బడ్జెట్‌లో
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
Snack for Weight Loss : ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ప్రతిరోజూ బెల్లం-శనగలు తింటే కలిగే లాభాలివే.. బరువు తగ్గడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు
ABP Southern Rising Summit 2025: దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
దక్షిణ భారత్ నుంచి లభించిన ప్రేమ ఎంతో స్ఫూర్తిదాయకం - ఏబీపీ న్యూస్ డైరెక్టర్ ధ్రుబ ముఖర్జీ
Embed widget