అన్వేషించండి

Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ

Anantapur Drivers Colony: అనంతపురం డ్రైవర్స్ కాలనీలో దారుణం. కూతురిపై కన్నేసిన ప్రియుడు సురేష్ మర్మాంగాన్ని కోసేసిన సునీత. ఆసుపత్రిలో బాధితుడి పరిస్థితి విషమం.

Anantapur GGH Hospital Emergency Case:  అనంతపురం నగరం డ్రైవర్స్ కాలనీలో అర్ధరాత్రి వేళ ఓ తీవ్రమైన నేర ఉదంతం కలకలం రేపింది. వివాహేతర సంబంధం నెరుపుతున్న ప్రియుడే కన్నకూతురిపై కన్నేసి అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆగ్రహంతో ఓ మహిళ ప్రియుడిని మరోసారి అలాంటి  పని చేయకుండా శిక్షించాలనుకుంది.   నమ్మించి ఇంట్లోకి పిలిపించి, పథకం ప్రకారం కాళ్లు చేతులు కట్టేసి అతడి మర్మాంగాన్ని కోసేసింది. రక్తమోడుతున్న బాధితుడి అరుపులతో డ్రైవర్స్ కాలనీ వాసులు భయాందోళనకు గురికాగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. 

వివాహేతర బంధం పెట్టుకున్న మహిళ కుమార్తెపై కన్ను

 డ్రైవర్స్ కాలనీకి చెందిన సునీత అనే మహిళతో సురేష్ అనే యువకుడికి కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో సురేష్ తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అయితే, గత కొంతకాలంగా సునీత మైనర్ కూతురిపై సురేష్ కన్ను పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికతో అసభ్యంగా ప్రవర్తించడం, వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన కూతురు తల్లికి తెలపడంతో, సునీత లోలోపలే తీవ్ర ఆందోళన, ఆగ్రహంతో రగిలిపోయింది.      

బుద్ది చెప్పాలని ప్లాన్ చేసిన మహిళ               

సురేష్ బుద్ధి మార్చుకోవాలని హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సునీత ఒక భయంకరమైన పథకానికి రూపకల్పన చేసింది. ఎప్పటిలాగే మాట్లాడదామని నమ్మించి సురేష్‌ను తన నివాసానికి పిలిపించింది. అతను మద్యం మత్తులో ఉండటాన్ని అవకాశంగా తీసుకుని, ఏమాత్రం అనుమానం రాకుండా పక్కా ప్లాన్ ప్రకారం అతని కాళ్లు, చేతులను తాడుతో గట్టిగా కట్టేసింది. ఆ తర్వాత వంటగదిలోని పదునైన కత్తిని తీసుకుని సురేష్ మర్మాంగాన్ని తీవ్రంగా కోసేసింది.             

ఆస్పత్రికి  తరలించిన పోలీసులు - పరిస్థితి విషమం             

తీవ్ర రక్తస్రావంతో సురేష్ బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన సురేష్‌ను వెంటనే అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి  తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యుల బృందం అత్యవసర శస్త్రచికిత్స అందిస్తోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతపురం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్ర కోణంలో విచారణ చేపట్టారు.

ఈ విస్తుపోయే క్రైమ్ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. కన్నకూతురి రక్షణ కోసం మహిళ అంతటి దారుణానికి ఒడిగట్టిందా లేక ఈ ఘటన వెనుక మరిన్ని వివాహేతర, ఆర్థిక వివాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. తీవ్రంగా గాయపరిచిన సునీతను పోలీసులు అదుపులోకి తీసుకుని  ప్రశ్నిస్తున్నారు.                                                 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget