Dammu Srija - Bigg Boss 9: తనూజను కార్నర్ చేసిన ఓనర్స్... అందరూ ఏమైనా నిలబడ్డ తనూజ... కావాలని దమ్ము శ్రీజకు హైప్ ఇస్తున్నారా?
Bigg Boss 9 Telugu: 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 షో మొదలైన రెండు రోజుల్లో ఆట రసవత్తరంగా మారింది. దమ్ము శ్రీజ వర్సెస్ తనూజ ఎపిసోడ్ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.

'బిగ్ బాస్' మొదటి వారం నామినేషన్ ప్రక్రియ అప్పుడే రసవత్తరంగా మారింది. ఓనర్స్, టెనెంట్స్ ఆల్రెడీ బిగ్ బాస్ అయితే కంటెస్టెంట్ల మధ్య చిచ్చులు పెట్టేశాడు. ఇక ఇంట్లో వంట దగ్గర పెంట జరుగుతుందని అందరికీ తెలిసిందే. ఇన్ని సీజన్లు చూశాం. అన్నింట్లో మొదటి గొడవ కిచెన్ దగ్గరే వస్తుంది. ప్రేమగా వండినా బాధే.. వండకపోయినా బాధే.. ఏం చేసినా సరే ఏదో ఒక గొడవ అక్కడ వస్తుంటుంది. అలా చాలా సార్లు చాలా మంది మంది ఈ కిచెన్ గొడవల వల్లే ఎలిమినేట్ అయిన సందర్భాలున్నాయి.
ఇక ఈ సారి టెనెంట్స్‌ను ఇష్టం వచ్చినట్టు వాడుకోండి. ఆడుకోండి... ఇష్టమైన పదార్థాలు వండించుకుని తినండి అని ఓనర్స్‌కి పగ్గాలు ఇచ్చారు. ఈ ఓనర్స్ మాత్రం వారి వారి షేడ్స్ అన్నీ చూపిస్తున్నారు. టెనెంట్స్‌కి ఆకలి లేదు అన్నా సరే మానవతామూర్తులు అన్నట్టుగా హరీష్, శ్రీజ, ప్రియ ఇలా అందరూ ఫ్రూట్స్ తెచ్చి ఇస్తున్నారు. ఇక తనూజ, భరణిలకు ఆర్డర్‌ల మీద ఆర్డర్‌లు వేస్తున్నారు. అది వండి పెట్టండి. ఇది వండి పెట్టండి.. అది ఎలా ఉంది.. ఇది ఎలా చేస్తున్నారు? అంటూ ఆ ఇద్దరినీ ఓనర్స్ పదే పదే అడుగుతూనే ఉంటున్నారు.
అక్కడ వంట చేయడమే కష్టంగా ఉంటే.. ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చి అది చేయండి.. ఇలా చేయండి.. అలా చేయండి అని చెబుతుంటే కచ్చితంగా చిరాకు వస్తూనే ఉంటుంది. అది వంట చేసే వాళ్లకు అర్థం అవుతుంది. ఇక నామినేషన్‌లో తనూజని పెట్టిన శ్రీజ రకరకాల కారణాలు చెప్పి.. ఓనర్స్ అంతా ఏకమై ఆమె మీద పడ్డారు. నిన్న లైవ్‌లో జరిగి ఈ మ్యాటర్‌తో తనూజ వెక్కి వెక్కి ఏడ్చేసింది. తలొక మాట చెబుతుంటారు.. మీలో మీకే యూనిటీ లేదు అని తనూజ అనేసింది.
'రాత్రి అందరం డిసైడ్ అయి మీకు చెప్పాం కదా?' అని ఒకసారి... 'మా ఇష్టం వచ్చినట్టుగా చెబుతాం' అని మరోసారి... 'మేం చెప్పింది చెప్పినట్టుగా వండాలి... ఎప్పుడు చెబితే మీకేంటి?' అంటూ ఓనర్స్ అంతా కలిసి తనూజ మీద పడ్డారు. 'ఆలు ఫ్రై అడిగితే... ఆలు కర్రీ చేసి పెట్టావ్' అని రాద్దాంతం చేసింది శ్రీజ. 'వండిన ఫుడ్ బాగుంది కానీ.. మేం అడిగిన ఫుడ్ వండలేదు' అంటూ శ్రీజ పెద్ద గొడవ చేసి నామినేషన్‌లోకి తీసుకు వచ్చింది.
రీతూ చౌదరి విషయంలోనూ తనూజను కార్నర్ చేసింది. రీతూ సైతం తనూజదే తప్పు అన్నట్టుగా చెప్పింది. ఇక ఇవన్నీ చాలవన్నట్టుగా తనూజను బాడీ షేమింగ్ కూడా చేసేశారు. 'ఎప్పుడూ చిరాగ్గానే వండి పెడుతుంది... నవ్వుతూ, ప్రేమతో పెట్టదు... మీరు, మీ బాడీ లాంగ్వేజ్ నాకు నచ్చడం లేదు' అంటూ ఇలా పర్సనల్‌గా వెళ్లాడు హరీష్. ఇలా అందరూ నానా రకాలుగా తనూజను కార్నర్ చేసి వదిలేశారు.
ఇన్ని కామెంట్లను విని తనూజ ఒక్కసారిగా బరెస్ట్ అయింది. కానీ ఓనర్స్ అంతా మాత్రం 'తనూజను భలే కార్నర్ చేశాం... భలే పాయింట్లు తీశాం' అంటూ సంబరపడిపోయారు. ఇక దానికి తగ్గట్టుగా తాజాగా ప్రోమోను వదిలి... తనూజని శ్రీజ కార్నర్ చేసిందని, తనూజ దుమ్ముదులిపేసిన శ్రీజ అంటూ పిచ్చి పిచ్చిగా స్టార్ మా వాడే పోస్టులు వేస్తున్నాడు. దీంతో సోషల్ మీడియాలో తనూజ ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్ స్టార్ మాని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇలా శ్రీజను లేపే ప్రయత్నం చేస్తే.. పడే ఆ ఓట్లు కూడా పడవు.. చాలా ఇరిటేటింగ్‌గా ఆమె ఉంది.. ఆమె ఓవర్ యాక్షన్ చేస్తోంది.. తనూజ ఫైటర్ అంటూ నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యలకు వేలల్లో... సెలెబ్రిటీలకు లక్షల్లో... ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?





















