Bigg Boss 9 Telugu Today Episode: బిగ్ బాస్ హౌస్‌లో రెండో రోజు... బాత్రూంలో షాంపు ఇష్యూ, బ్యాక్ బిచింగ్ మ్యాటర్... ఇవేం గొడవలురా నాయన!
Bigg Boss 9 Today Episode Review: బిగ్ బాస్ ఇంట్లో ఈసారి స్టార్టింగ్ నుంచే గొడవలు మొదలయ్యాయి. రెండో రోజు నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇప్పటి వరకు ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..?

Bigg Boss Telugu 9 - Day 2 Episode 3 Review: బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారంలో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ నామినేషన్ జరిగే మధ్యలో ఇంట్లో చాలానే గొడవలు జరిగాయి. ఊరికే గొడవలు, కన్నీరు పెట్టుకుని సీన్ క్రియేట్ చేయడంతో ఎపిసోడ్ అంతా రచ్చ రచ్చగా మారింది. ఈ క్రమంలో ప్రియా ఏడ్పులు.. ఫ్లోరా షైనీ, సంజనా మధ్య గొడవలతో ఈ రెండో రోజు గందరగోళంగా మారింది. అసలు ఈ రెండో రోజు ఎలా సాగిందో ఓ సారి చూద్దాం..
ఓనర్స్ అంతా కలిసి ఒక్క టెనెంట్‌ని నామినేట్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు. ప్రతీ దానికి సాగదీస్తోందని సంజనను అందరూ కలిసి నామినేట్ చేశారు. మీ వల్ల ఇతర ప్లేయర్స్‌ని అనాల్సి వస్తోంది.. మిస్ అండర్ స్టాండింగ్ చేసుకోవాల్సి వస్తోంది.. మీ వల్ల నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి.. అని మనీష్ అనడంతో సంజన హర్ట్ అయింది. మీకు కుకింగ్ రాదన్నట్టుగా చెబుతున్నారు.. వచ్చు అన్నట్టుగా మళ్లీ చెబుతున్నారు.. అలా మాటలు మార్చుతూనే ఉన్నారు అని ఓనర్స్ అన్నారు. మైక్ కూడా సరిగ్గా ధరించడం లేదు.. ఏదో బ్యాక్ బిచింగ్ చేసుకుంటున్నారు అని ప్రియా అనేసింది. బ్యాక్ బిచింగ్ అనే పదాన్ని వాడకండి, నాకు నచ్చదు.. అని సంజనా వాదించింది.
ఆ తర్వాత ఫ్లోరా, సంజన మధ్య మాటల యుద్దం జరిగింది. మీరు నన్ను ఫ్రీ బర్డ్ అని ఎలా అన్నారు? నన్ను మాత్రం అలా అంటారు.. మిమ్మల్ని బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అని అంటే మాత్రం కోపం వచ్చిందా? అన్నట్టుగా ఫ్లోరా షైని వాదించింది. నేను మిమ్మల్ని కావాలని అనలేదు.. బాధపెట్టాలని అనలేదు.. ఇక్కడితో ఇది వదిలేయండి అని సంజనా చెప్పుకొచ్చింది. ఈ నామినేషన్ నన్నేమీ ఎఫెక్ట్ చేయదు అంటూ సంజన తనలో తాను మాట్లాడుకుంది. నా వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుందట.. అంతలా నేనేమీ చేశాను.. అంటూ సంజనా కన్నీరుమున్నీరు అయింది.. మేం ఇలా అనిపించుకోవడానికి వచ్చామా? ఆ మాట మాత్రం చాలా తప్పు.. రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లేదు.. నేను ఇది ఎప్పటికీ మర్చిపోను.. అని ఏడుస్తూ తన బాధను తనూజకు చెప్పుకుని ఏడ్చేసింది సంజన.
ఇక రెండో రోజు ఉదయాన్నే హాట్ వాటర్ కోసం రీతూ గుంజీల్లు తీసింది. బనానా కోసం పవన్‌తో సంజనా సాల్సా డ్యాన్స్ చేసింది. ఇక బిగ్ బాస్ తమ టెనెంట్స్‌కి ఫుడ్ పంపించాడు. ఆ ఫుడ్‌ని తినాలని శ్రీజ, ప్రియ ప్రయత్నించింది. కానీ రాము రాథోడ్ మాత్రం వద్దని వారించాడు. అది రూల్స్‌కి విరుద్దం అవుతుందేమో అని అన్నాడు. ఈ విషయాన్ని కూడా ప్రియ, శ్రీజ నానా హంగామా చేశారు. అలా తినాలని వస్తే.. నోటి దగ్గరి నుంచి ఫుడ్ ఎలా లాక్కుంటాడు అని శ్రీజ, ప్రియ రచ్చ రచ్చ చేశారు. చివరకు ప్రియ కన్నీరు కూడా పెట్టేసుకుంది. మేం మీకు ఫ్రూట్స్ ఇస్తున్నాం కదా? అని మేం కూడా కఠినంగానే వ్యవహరిస్తామని కూడా అనేశారు. ఆ తరువాత చివరకు రాము వచ్చి ప్రియ, శ్రీజలకు సారీ చెప్పాడు.
ఆ తర్వాత రాముతో బట్టలు ఉతికించే టాస్క్ పెట్టారు. మంచి ఫుడ్ ఇచ్చిన తనూజ, భరణిలకు కాఫీ ఇచ్చారు ఓనర్స్. బాత్రూం క్లీనింగ్ విషయంలో ఫ్లోరాకి సంజనాకి పెద్ద గొడవే జరిగింది. సంజనా వాడిన షాంపు, కండీషనర్ బాటిల్స్ బాత్రూంలోనే పెట్టింది. అవన్నీ తీయడానికి నేను మీ సర్వెంట్ కాదు అని ఫ్లోరా అనేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. అవి బాత్రూంలోనే ఉంటే తప్పేంటి? లోపల ఉన్నప్పుడు వాటి అవసరం పడితే మళ్లీ బయటకు వచ్చి తీసుకోలేం కదా? అందుకే లోపల పెట్టాను అని అందరితో సంజనా వాదించింది.
చివరకు మానిటర్ కళ్యాణ్ పడాల వచ్చి చెప్పినా ఆమె తీయలేదు. దీంతో అందరూ ఆమెను వ్యతిరేకించారు. చివరకు కళ్యాణ్ ప్రేమగా చెప్పడంతో సంజనా తీసేసింది. ఈ క్రమంలో సంజనని పుటేజ్ కోసమే ఇదంతా చేస్తున్నారా? అని శ్రీజ అనేసింది. దీంతో శ్రీజ అంటే సంజనా కోపంతో రగిలిపోయింది. శ్రీజ సైకో అని, శ్రీజతో అసలు మాట్లాడటం కూడా నచ్చడం లేదు అని ఇమ్ముతో సంజన చెప్పుకొచ్చింది. ఆ తరువాత బనానాని దొంగ చాటుగా తినేందుకు తనూజ, ఇమ్ము, రీతూ నానా తంటాలు పడ్డారు.
Also Read: బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యలకు వేలల్లో... సెలెబ్రిటీలకు లక్షల్లో... ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?
Arguments, debates & full spice! 🔥 First week nominations lo unna contestants evaru?🤔
— Starmaa (@StarMaa) September 9, 2025
Watch #BiggBossTelugu9 Mon-Fri at 9:30PM, Sat & Sun at 9PM On #StarMaa & Stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow #StarMaa #JioHotstar pic.twitter.com/nOqVjJSwTJ
అనంతరం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ లెవెల్‌లో తనూజ, రీతూ పోటీ పడ్డారు. వెంటనే రీతూ పడిపోవడంతో మెడికల్ రూంకు బిగ్ బాస్ పిలిచాడు. దీంతో తలకు గాయం అవ్వడంతో కట్టు కట్టి పంపాడు. తనూజని నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేస్తోందంటూ సంజనాని తనూజ నామినేట్ చేసింది. ఈ నామినేషన్‌ను ఫైనల్ చేసేందుకు కళ్యాణ్ పడాలని ఎంచుకుంది తనూజ. సంజనా నామినేషన్‌ను కళ్యాణ్ ఓకే చేశాడు. రాము, శ్రష్టి పోటీ పడగా.. రాము గెలిచాడు. ఆ తర్వాత సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. స్ట్రాంగ్ కాదేమో అన్న అనుమానంతో సుమన్‌ను నామినేట్ చేశాడు. ఇక ఈ నిర్ణయాన్ని తీసుకునేందుకు హరీష్‌ను రాముని ఎంచుకున్నాడు.
హరీష్ కూడా రాము చెప్పిన పాయింట్లను అంగీకరించి సుమన్ నామినేషన్‌ను ఓకే చేశాడు. ఏమైనా చెబుతారా? అని సుమన్‌ను హరీష్ అంటే.. ఏం లేదు అని సుమన్ అంటాడు. ఏమైనా రెస్పాండ్ ఇస్తారా? అని మధ్యలో సంజన వచ్చి సలహా ఇస్తే.. నాకు తెలుగు వచ్చు.. తెలుగులోనే ఆయన చెప్పాడు అని సుమన్ కౌంటర్ వేశాడు. దీంతో సంజన సైలెంట్ అయింది. వచ్చి రెండు, రోజులే అయింది. అందరితో మాట్లాడుతున్నా.. కలుస్తున్నా.. కదా అని సుమన్ తన వాదనను వినిపించాడు. కానీ అందరిలోనూ తక్కువ అనిపిస్తోందంటూ హరీష్ తన పాయింట్లు చెప్పాడు. ఆ తరువాత కళ్యాణ్, హరీష్‌లను నామినేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేసే భాగంలో ఇద్దరి కంటెస్టెంట్ల పేర్లను చెప్పమని అన్నాడు. వాళ్లిద్దరూ డిస్కస్ చేసుకుని భరణి, ఇమ్ము పేర్లను చెప్పారు. ఇక అంతటితో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరి రేపటి ఎపిసోడ్‌లో ఇంకేం జరుగుతుందో చూడాలి.
Also Read: బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?






















