Bigg Boss 9 Telugu Contestants Remuneration: బిగ్ బాస్ సీజన్ 9లో సామాన్యలకు వేలల్లో... సెలెబ్రిటీలకు లక్షల్లో... ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అడుగు పెట్టిన కామనర్స్, సెలబ్రిటీలకు రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారనే ఆసక్తి అందరిలో ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఆ వివరాలు తెలుసుకోండిక..

Bigg Boss Telugu 9 - Remuneration: బిగ్ బాస్ షోకి కొంత మంది ఫేమస్ అవ్వడానికి వెళ్తారు.. ఇంకొంత మంది మంచి రెమ్యూనరేషన్ వస్తేనే, ఇస్తేనే వెళ్తారు. బిగ్ బాస్ టీంకి ఆ కంటెస్టెంట్ అవసరం అని అనుకుంటే ఎంతైనా చెల్లిస్తుంటారు. కానీ కొంత మందిని మాత్రం నామమాత్రంగానే తీసుకుంటారు. ఇక ఇప్పుడు కామనర్స్‌ని ఇంట్లోకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కామనర్స్‌కి అసలు ఎలాంటి రెమ్యూనరేషన్ ఇచ్చి ఉండరు అని అంతా అనుకున్నారు. కామనర్స్‌కి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే హక్కు, అధికారం కూడా ఉండదన్న సంగతి తెలిసిందే.
పైగా ఓ కామనర్ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి.. అక్కడ ఉండాలంటే చిన్న విషయం కాదు. వీకెండ్ డ్రెస్‌లు, క్యాస్టూమ్స్ అంటూ ఇలా తడిసి మోపెడవుతుంది. ఇక ఈ సారి ఆరుగురు కామనర్స్‌ని ఇంట్లోకి పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరుగురుకి ఒకే రకంగా పేమెంట్స్ ఇస్తున్నారట. వారానికి అరవై వేలు చెల్లిస్తున్నారని సమాచారం. ఇక ఇదే క్రమంలో సెలెబ్రిటీలకు చూసుకుంటే మాత్రం చాలా గట్టిగానే ఇస్తున్నారని టాక్.
ఈ సారి సెలెబ్రిటీల లిస్ట్‌లో కూడా అదిరిపోయే క్యాండిడేట్లు ఎవ్వరూ లేరు. ఉన్నంతలో ఒక్క ఇమాన్యుయేల్‌కి మాత్రమే క్రేజ్ ఉందని అర్థం అవుతోంది. ఓ స్టార్ సెలెబ్రిటీ అన్నట్టుగా ఒక్కరూ కనిపించడం లేదు. ఆ సంజనా గల్రానీ, ఫ్లోరా షైనీలను తెలుగు ఆడియెన్స్ అంతగా పట్టించుకోరు. చూస్తుంటే వారు రెండు, మూడు వారాల్లోనే బయటకు వెళ్లేలా కనిపిస్తోంది. ఇక ఈ సెలెబ్రిటీలకు మాత్రం లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు వారానికి వెళ్తోందని టాక్.
Ee saari rent leni tenants ranarangam ki ela siddham avutharo choodham! 🔥
— Starmaa (@StarMaa) September 7, 2025
The house doors are open! 🏠 Catch the Grand Launch of #BiggBossSeason9 Playing Now only on #StarMaa#BiggBossTelugu9 #BiggBossTelugu9GrandLaunch pic.twitter.com/mEoDVy24Z3
ఇందులో ఇమాన్యుయేల్‌కు మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారని సమాచారం. ఇక రీతూ, తనూజ, భరణి, సుమన్ శెట్టి వంటి వారికి కూడా తగిన పారితోషికమే ఇస్తున్నారట. మొత్తంగా ఈ సారి సెలెబ్రిటీల లిస్ట్ జనాల్ని అంతగా ఇంప్రెస్ చేయలేకపోయినా.. కామనర్స్ వర్సెస్ సెలెబ్రిటీస్ ఆట అనేది మాత్రం కచ్చితంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినట్టుగానే కనిపిస్తోంది. మరి మున్ముందు ఈ గ్రూపుల మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో, ఎలా ఈ షో జనాల్ని ఆకర్షిస్తుందో చూడాలి.
Double house unnappudu owners ki ee maatram fire untundhi! 🤙🔥
— Starmaa (@StarMaa) September 7, 2025
The house doors are open! 🏠 Catch the Grand Launch of #BiggBossSeason9 Playing Now only on #StarMaa#BiggBossTelugu9 #BiggBossTelugu9GrandLaunch pic.twitter.com/Rw43d3WuPS
Also Read: బిగ్ బాస్ 9 రివ్యూ... గుండు అంకుల్ రచ్చ, మంచితనం మరీ ఎక్కువైందే... మొదటి ఎపిసోడ్ ఎలా సాగిందంటే?



















