Bigg Boss Telugu 9 Contestants Salary : బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్.. భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?
Bigg Boss Telugu Season 9 Contestants Remuneration : బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు స్టార్ట్ అయిపోయింది. అయితే ఎవరెవరికి ఎంత రెమ్యూనిరేషన్ ఇచ్చి హౌజ్‌లోపలికి తీసుకెళ్లారో ఇప్పుడు చూసేద్దాం.

Bigg Boss Telugu 9 Remuneration List : బిగ్‌బాస్ సీజన్ 9లో కామనర్స్, సెలబ్రెటీలను ఉంచి గేమ్‌ని ఇంట్రెస్టింగ్ మార్చాడు బిగ్‌బాస్. అయితే కంటెస్టెంట్లు అంత బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు కానీ.. వారితో భిన్నంగా ఆడుకునేందుకు బిగ్‌బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా విడుదలైన ప్రోమోలు బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే అసలు బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు సెలబ్రెటీలు, కామనర్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? రోజుకి ఎంత ఇస్తారు? అందరికంటే ఎక్కువ ఎవరికి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ఫ్లోరా సైనీ

ఫ్లోరా సైనీ అదేనండి ఆశా షైనీకి రోజుకు 42,857 రెమ్యూనిరేషన్. అంటేవారానికి దాదాపు మూడు లక్షలు.
సంజనా గర్లానీ

బుజ్జిగాడు ఫేమ్ సంజనా గర్లానీకి రోజుకు 39,285 రెమ్యూనిరేషన్ బిగ్‌బాస్ టీమ్ పే చేస్తుంది. అంటే వారానికి 2,75,000 అనమాట.
రీతూ చౌదరి

బుల్లితెర హాట్ ముద్దుగుమ్మ రీతూ చౌదరికి రోజుకు 39,285 పే చేయనుంది బిగ్‌బాస్ టీమ్. అంటే వారానికి రెండు లక్షల 75వేలు సంపాదించనుంది.
భరణి

ఈ సీజన్లో ఎక్కువ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న వ్యక్తి భరణినే. ఇతనికి రోజుకి 50,000 చొప్పున వారానికి 3,50,000 ఇస్తోందట టీమ్.
తనూజ

ముద్దామందారం సీరియల్ ఫేమ్ తనూజకు రోజుకు 35,714 రెమ్యూనిరేషన్ ఇవ్వనున్నారట. వారానికి రెండు లక్షల యాభైవేలు తీసుకుంటుంది ఈ బ్యూటీ.
శ్రష్టి వర్మ

కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ ఫోక్స్ వివాదంలో మీడియాలో హైలెట్ అయిన శ్రష్టి వర్మకు రోజుకు 28,571 చెల్లిస్తుంది బిగ్‌బాస్ టీమ్. అంటే వారానికి రెండు లక్షలు.
సుమన్ శెట్టి

వారానికి 2,50,000 అంటే రోజుకు 35,000 చొప్పున బిగ్‌బాస్ టీమ్ డబ్బులు ఇవ్వనుందట.
ఇమ్మాన్యూయేల్

జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యూయేల్కి రోజుకు 32,142 చొప్పున వారానికి 2,25,000 పే చేస్తున్నారట.
రాము రాథోడ్

యూట్యూబ్ సెన్సెషన్ రాము రాథోడ్‌కి రోజుకు 28,571 చొప్పున వారానికి రెండు లక్షలు ఇస్తున్నారట.
కామనర్స్ అందరికీ ఒకటే రెమ్యూనిరేషన్!?
ప్రియా

కామనర్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియకు రోజుకు 10,000 చొప్పున వారానికి డబ్భైవేలు ఇస్తున్నట్లు సమాచారం.
శ్రీజ దమ్ము

బిగ్‌బాస్ హోజ్లో ఓనర్స్‌లో ఉన్న శ్రీజ దమ్ముకి కూడా రోజుకు పదివేలు ఇస్తూ వారానికి 70,000 ఇవ్వనున్నారట.
డిమోన్ పవన్

కామనర్ అయిన ఇతనికి రోజుకి పదివేల చొప్పున వారానికి డబ్భై వేలు ఇస్తున్నారట.
మిలటరీ కళ్యాణ్

మిలిటరీ నుంచి బిగ్‌బాస్‌కు వచ్చిన కళ్యాణ్‌కు సైతం వారానికి 70,000 అంటే రోజుకు 10,000 ఇస్తున్నారట.
మనీష్ మర్యాద

మనీష్‌కి కూడా రోజుకు పదివేల చొప్పున వారానికి 70,000 ఇస్తున్నారు.
హరీష్

మాస్క్ మ్యాన్‌గా బిగ్‌బాస్‌లోకి వచ్చిన హరీష్‌కు కూడా సేమ్ రెమ్యూనిరేషన్ ఇస్తోంది బిగ్‌బాస్ టీమ్. వారానికి 70 వేలు చొప్పున రోజుకు 10,000 ఇస్తున్నారు.






















