Konaseema Vande Bharat: కోనసీమ వందే భారత్ ప్రారంభం నేడే.. ట్రైన్ టైమింగ్స్, టికెట్ ధరలు ఇలా
Narasapur chennai vandebharat | నేడు నరసాపురం - చెన్నై వందే భారత్ ప్రారంభం కానుంది. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మధ్యాహ్నం జెండా ఊపి ప్రారంభించనున్నారు.

కోనసీమ వందే భారత్ గా చెబుతున్న నరసాపురం -చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఈరోజే ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతం లో తొలిసారిగా నరసాపురం నుండి బయలుదేరి వెళ్లనుంది ఈ ట్రైన్.
ప్రకటించిన దానికన్నా నెలముందే వందే భారత్ ప్రారంభం
నిజానికి నరసాపురం వందే భారత్ 12 జనవరి 2026 న ప్రారంభం కావాలి. ఎందుకంటే ట్రైన్ ప్రకటించిన నాటి నుండి ప్రారంభం మధ్య రిజర్వేషన్ కోసం రెండు నెలలు గ్యాప్ ఇవ్వాలి. అయితే ఇది క్రొత్త ట్రైన్ కాదు ఆల్రెడీ చెన్నై -విజయవాడ మధ్య తిరుగుతున్న ట్రైనే కాబట్టి నరసాపురం వరకూ పొడిగించిన మాత్రాన రెండు నెలల గ్యాప్ అవసరం లేదని కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ పట్టు బట్టడం తో రైల్వే అధికారులు దాదాపు నెల ముందే అంటే ఈరోజున (15 డిసెంబర్ 2025 ) నరసాపురం వందే భారత్ ను ప్రారంభిస్తున్నారు. మధ్యాహ్నం 2:50కి ఈ ట్రైన్ నరసాపురం నుండి బయలుదేరి వెళ్లనుంది.
కోనసీమ వందే భారత్ టైమింగ్స్ ఇవే
ఈ వందే భారత్ ట్రైన్ చెన్నై లో 5.30 గంటలకు బయలుదేరి (20677 నెంబర్) రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్‌లలో ఆగుతూ విజయవాడలో 11.45 గంటలకు, మధ్యాహ్నం 12:30 గంటలకు గుడివాడ, మధ్యాహ్నం 1:15 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని మధ్యాహ్నం 2:10 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 20678 నెంబర్ రైలు నర్సాపురం నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి 3:19 గంటలకు భీమవరం టౌన్ చేరుకుని, 4:05 గంటలకు గుడివాడ చేరుకుని, 4:50 గంటలకు విజయవాడకు రాత్రి 23.45 గంటలకు చెన్నై సెంట్రల్ కు చేరుతుంది. నరసాపురం నుండి విజయవాడ కు టికెట్ చైర్ కార్ లో రూ.565, ఎగ్జిక్యూటివ్ కోచ్ లో 1080, అదే చెన్నైకయితే చైర్ కార్ లో 1635, ఎగ్జిక్యూటివ్ కోచ్ లో రూ.3030గా ఉంటుంది.
ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న డిమాండ్ కోనసీమ వందే భారత్
దేశంలో వందే భారత్ లు ప్రవేశ పెట్టి నప్పటి నుండి తమకూ వందే భారత్ కావాలని నరసాపురం, భీమవరం ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాల నుండి మద్రాస్ పరిసరాల్లో వ్యాపారాలు నిర్వహించే వరు ఎక్కువ. అందుకే సర్కార్ ఎక్స్ ప్రెస్ లాంటివి ఈ రూట్ లోనే చెన్నై వెళుతుంటాయి. వేగంగా తమ ప్రయాణం జరిగేలా వందే భారత్ తమ రూట్ లో వేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని ఇక్కడ డిమాండ్ ఎప్పటినుండో వినిపిస్తుంది. ప్రస్తుత నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ కు కేంద్ర మంత్రి పదవి దక్కడం తో ఆయన రైల్వే శాఖ తో చర్చలు జరిపి ఆ డిమాండ్ ను రియాల్టీ లోకి తెచ్చారు.





















