అన్వేషించండి

BJP National Working President: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

Who Is Nitin Nabin | బిహార్ మంత్రి, ఎమ్మెల్యే నితిన్ నబిన్ ను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. జేపీ నడ్డా స్థానాన్ని నితిన్ నబీన్ భర్తీ చేయనున్నారు.

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) ఆదివారం నాడు అగ్రస్థాయిలో ముఖ్యమైన సంస్థాగత మార్పులు చేసింది. బిహార్ మంత్రి, ఎమ్మెల్యే నితిన్ నబిన్‌ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. దాంతో నబిన్ ప్రస్తుత పార్టీ చీఫ్ JP నడ్డా స్థానంలోకి రానున్నారు. ఈ ప్రకటన బీజేపీలో విస్తృతమైన సంస్థాగత మార్పులను సూచిస్తుంది. బిహార్‌లో వచ్చే ఎన్నికల్లో సొంతంగానే అధికారంలోకి రావాలన్న ప్లాన్ ఉందని బీజేపీ ఈ నియామకంతో చెప్పకనే చెప్పింది.

బీజేపీలో కీలక మార్పులు

బీజేపీ అధిష్టానం పంకజ్ చౌదరిని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. బిహార్‌లో PWD మంత్రి, కాయస్థ నాయకుడైన నితిన్ నబిన్‌ ప్రస్తుతం బిహార్‌లోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిగా పనిచేస్తున్నారు. పాట్నాలోని బంకిపూర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


BJP National Working President: బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్, ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి?

ఎవరీ నితిన్ నబిన్‌..

దివంగత బీజేపీ నాయకుడు నబిన్ కిషోర్ సిన్హా కుమారుడైన నితిన్ నబిన్‌, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)తో విద్యార్థి దశలోనే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీ పాట్నా యూనిట్‌లో బలమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన 2000ల చివరిలో రాజకీయాల్లోకి ప్రవేశించి 2010లో తన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అప్పటి నుండి, నబిన్ బంకిపూర్ నుండి వరుసగా తిరిగి ఎన్నికయ్యారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాలనపై దృష్టి సారించి జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 

బిహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర..

ఎన్నికల్లో కీలకమైన బిహార్ బీజేపీ యువజన విభాగం బాధ్యతల్ని నిర్వహించారు. నితిన్ నబిన్ ఇటీవల కాలంలో బీజేపీ యువజన విభాగం, యువ మోర్చాతో విస్తృతంగా పనిచేశారు. అనేక సంస్థాగత, ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలను నిర్వర్తించారు. వీటిలో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల నియామకాలు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది.

జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కులలో ఒకరైన నితిన్ నబిన్, పరిపాలనా అనుభవం, సంస్థాగత బలం రెండింటి కలయికగా పార్టీలో భావిస్తారు. సీనియర్ నాయకులు ఆయన పాలనా రికార్డు, క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తుంటారు.

బిహార్ మంత్రిగా ఉన్న నితిన్ నబీన్‌కు బీజేపీ ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించింది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారనే వార్త రాగానే, పట్నాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు మొదలయ్యాయి. కార్యకర్తలు భారీగా బాణాసంచా కాల్చి, డప్పుల మోతతో డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. 

బిహార్‌కు దక్కిన గౌరవం
ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఒకరికొకరు లడ్డూలు, మిఠాయిలు పంచుకుని అభినందనలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పరిశ్రమల శాఖ మంత్రి డా. దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ సాధించిన ఘన విజయం కారణంగా బిహార్‌కు ఈ గిఫ్ట్ లభించిందని అన్నారు. రాష్ట్రానికి ఇది చాలా గర్వకారణమని, బిహార్ నుండి ఒక నాయకుడిని జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget