అన్వేషించండి

Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్

India vs South Africa 3rd T20I | ధర్మశాలలో జరిగిన భారత్ vs దక్షిణాఫ్రికా 3వ T20 మ్యాచులో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

ధర్మశాల: మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ పర్యాటక జట్టు దక్షిణాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా జట్టును 117 పరుగులకే ఆలౌట్ చేశారు. టార్గెట్ ఛేదించడానికి దిగిన భారత బ్యాట్స్‌మెన్‌ 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడుతూ మంచి ప్రారంభం ఇచ్చారు. గిల్- అభిషేక్ కలిసి 5 ఓవర్లలో భారత్‌ను 60 పరుగులకు చేర్చారు. అభిషేక్ భారీ షాట్ ఆడబోయి ఎయిడెన్ మార్క్‌రమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అభిషేక్ 18 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి.

అభిషేక్ ఔటయ్యాక పరుగుల కోసం తిప్పలు..
అభిషేక్ శర్మ ఔటయ్యే సమయానికి, 5.2 ఓవర్లలో భారత్ 60 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బ్యాటర్లు తాబేలు నడకలా నెమ్మదిగా పరుగులు చేశారు. మొదటి 5 ఓవర్లలో ఇండియా 12 రన్ రేట్‌తో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించగా, తర్వాతి 40 పరుగులు (60 నుంచి 100 పరుగుల వరకు) చేయడానికి భారత బ్యాట్స్‌మె 53 బంతులు ఆడారు.

నిలకడ చూపని గిల్, సూర్య
టీ20 జట్టు వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో 28 పరుగులు చేసినా, అందుకోసం 28 బంతులు తీసుకున్నారు. 18 ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత కూడా టీ20ల్లో శుభ్‌మన్ గిల్ అర్ధసెంచరీ కోసం ఎదురుచూపులు ముగియలేదు. లో స్కోరింగ్ మ్యాచులో వేగంగా పరుగులు చేయలేకపోయాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి 10 పరుగుల మార్కును దాటినా, ఈసారి కూడా సూర్య నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు. భారత కెప్టెన్ సూర్య 12 పరుగులకే ఔటయ్యాడు.

బౌలింగ్‌లో భారత బౌలర్ల అద్భుతం
ధర్మశాలలో జరిగిన మూడో టీ20లో మొదట భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి దక్షిణాఫ్రికా జట్టును కేవలం 117 పరుగులకే పరిమితం చేశారు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో బౌలర్‌గా హార్దిక్ పాండ్యా తన టీ20 కెరీర్‌లో 100 వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు. ఈ క్రమంలో పాండ్యా అరుదైన జాబితాలో చేరాడు. టీ20ల్లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన ప్రపంచంలో తొలి ఫాస్ట్ బౌలర్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు.

గతంలో ముగ్గురు స్పిన్నర్లు ఈ రికార్డు నమోదు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన షకీబ్, జింబాబ్వేకు చెందిన సికిందర్ రజా, ఆఫ్టనిస్తాన్ కు చెందిన మహ్మద్ నబీలు బ్యాటింగ్ లో వెయ్యి పరుగులు, బౌలింగ్‌లో 100 వికెట్లు తీశారు. ఓవరాల్‌గా ఈ ఫీట్ నమోదు చేసిన నాలుగో ప్లేయర్ పాండ్యానే.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Advertisement

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
Embed widget