Ind vs Sa 3rd T20I: రఫ్ఫాడించిన భారత బౌలర్లు, తక్కువ స్కోరుకే సఫారీలు ఆలౌట్.. సగం ఓవర్లు చాలు!
IND vs SA 3rd T20 | ధర్మశాల వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 117 పరుగులకు ఆలౌట్ అయింది.

India vs South Africa 3rd T20I | ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న మూడో T20 మ్యాచ్‌లో భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 117 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం కలిసొచ్చింది. భారత బౌలర్లు అద్భుతంగా రాణించి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయకుండా కట్టడి చేశారు.
భారత బౌలర్ల విజృంభణ
భారత్ తరఫున బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లను పరుగులు చేయకుండా బాగా ఇబ్బంది పెట్టారు. ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఒక పరుగు వద్దే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది దక్షిణాఫ్రికా. 7 పరుగులకే కీలక మైన డికాక్, రెజా హెండ్రిక్స్, డెవాల్డ్ బ్రెవిస్ వికెట్లు కోల్పోగా.. 30 పరుగుల వద్ద ట్రిస్టన్ స్టబ్స్ ఔటయ్యాడు. దాంతో సఫారీలు 100 చేస్తారా అనిపించింది. ముఖ్యంగా, 'బర్త్‌డే బాయ్' కుల్దీప్ యాదవ్ కూడా చక్కగా రాణించి రెండు వికెట్లు పడగొట్టాడు.
Innings Break!
— BCCI (@BCCI) December 14, 2025
A terrific collective show by the #TeamIndia bowlers 👌
Chase on the other side ⏳
Scorecard ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/wLjHQjkyfO
కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ హాఫ్ సెంచరీ (46 బంతుల్లో 61 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో సఫారీలు పరువు దక్కించుకున్నారు. డోనోవాన్ ఫెరీరా 20 పరుగులు చేయగా, ఆన్రిచ్ నోర్జే 12 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్షదీప్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, శివం దుబేలకు ఒక వికెట్ దక్కింది.
హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత..
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను ఔట్ చేయడం ద్వారా ఆయన ఈ అరుదైన ఘనతను సాధించారు. ఈ వికెట్‌తో పాండ్యా తన టీ20 కెరీర్‌లో వికెట్ల సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Milestone Moment!
— BCCI (@BCCI) December 14, 2025
That moment when Hardik Pandya became only the third #TeamIndia cricketer (in Men's cricket) to scalp 100 T20I wickets 👏👏
Updates ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/XYDxMvrEPz
100 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్
ట్రిస్టన్ స్టబ్స్ వికెట్ తీయడం ద్వారా హార్దిక్ పాండ్యా టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో 100 వికెట్లు తీసిన మూడో భారతీయ బౌలర్‌గా రికార్డు నెలకొల్పారు. ఆయన కంటే ముందు అర్ష్‌దీప్ సింగ్ (108 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (101 వికెట్లు) ఈ ఘనత సాధించారు. పాండ్యా ఇప్పటివరకు తన టీ20 కెరీర్‌లో 1939 పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లు పడగొట్టి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో 61 పరుగులు చేస్తే ప్రపంచంలో 2 వేల పరుగులు, 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలవనున్నాడు.





















