అన్వేషించండి

Hardik Pandya Records: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత

Hardik Pandya Unique Record: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడం ద్వారా హార్థిక్ పాండ్యా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన ఆల్ రౌండర్‌గా నిలిచాడు.

Hardik Pandya T20 Wickets: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించారు. మూడో T20 మ్యాచ్‌లో పాండ్యా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ T20 క్రికెట్‌లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ  ఘనత సాధించాడు. దీంతో పాటు హార్ధిక్ పాండ్యా T20 క్రికెట్‌లో వికెట్ల పరంగా ఒక ప్రత్యేక రికార్డును కూడా నెలకొల్పాడు.

స్టబ్స్ వికెట్‌తో పాండ్యా అరుదైన ఘనత

ధర్మశాలలో జరుగుతున్న మూడో T20 మ్యాచ్‌కు ముందు హార్దిక్ పాండ్యా తన T20 కెరీర్‌లో 99 వికెట్లు ఉన్నాయి. ట్రిస్టన్ స్టబ్స్‌ను ఔట్ చేయడంతో, అతను T20 ఫార్మాట్‌లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా T20 ఇంటర్నేషనల్‌లో భారత్ తరపున 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లుగా నిలిచారు. 

1000 పరుగులు, 100 వికెట్లు

పాండ్యాకు ముందు ప్రపంచంలో ఏ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా ఈ అరుదైన ఘనతను సాధించలేకపోయారు. ముగ్గురు స్పిన్ బౌలర్లు మాత్రం ఈ ఫీట్ నమోదు చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మహ్మద్ నబీ, జింబాబ్వేకు చెందిన సికిందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు చేయడంతో పాటు 100 వికెట్లు పూర్తి చేశారు.

టీ20లలో మూడో భారత బౌలర్
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన మూడో భారత క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా నిలిచాడు. తన టీ20 కెరీర్‌లో ఇప్పటివరకు 1939 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 100 వికెట్లు పడగొట్టి పలు మ్యాచులలో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత బౌలర్లలో ఇప్పటివరకు అత్యధిక టీ20 వికెట్లు అర్ష్‌దీప్ సింగ్ పేరు మీద ఉన్నాయి. అర్షదీప్ ఇప్పటివరకు 108 వికెట్లు తీశాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో 101 టీ20 వికెట్లు ఉన్నాయి. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో భారత్, దక్షిణాఫ్రికా 1-1తో సమంగా ఉన్నాయి. ఈ టీ20 మ్యాచ్ నెగ్గితే భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లనుంది. అంచనాలకు తగ్గట్లుగా భారత బౌలర్లు రాణించడంతో సఫారీలు 30 పరుగులకే టాపార్డర్ వికెట్లు కోల్పోయారు. మార్ క్రమ్ రాణించడంతో పరువు దక్కించుకునే స్కోరు చేయగలిగింది.

Also Read: CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Advertisement

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Mrunal Thakur: వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?
వెడ్డింగ్ న్యూస్ తర్వాత ఇన్‌స్టాలో మృణాల్ ఠాకూర్ ఫస్ట్ పోస్ట్... ధనుష్ కనెక్షన్ ఉందా?
Embed widget