Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
The Raja saab Second Single : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' నుంచి రెండో సింగిల్ వచ్చేస్తోంది. 'సహానా సహానా' అంటూ సాగే మెలోడీ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

Prabhas's The Raja Saab Second Single Sahana Sahana Song Promo Out : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ మారుతి కాంబోలో హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'ది రాజా సాబ్'. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ మెలోడీ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
మెలోడీ సాంగ్
'సహానా సహానా' అంటూ కూల్‌గా సాగే మెలోడి సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. 'శరత్ చంద్రిక తేజ యామిని నీలప్పలినివే మందగామిని ప్రమద్దీపికా హంస బామిని కదిలే దేవత స్త్రీవే' అంటూ సాగే లిరిక్స్ అదుర్స్ అనిపించాయి. ప్రభాస్, నిధి అగర్వాల్‌పై మెలోడీ సాంగ్ తీశారు.
ఫుల్ సాంగ్‌ను ఈ నెల 17న సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 'రెబల్ సాబ్' ట్రెండ్ అవుతోంది. 'సింగారే సింగ సింగ... సింగిల్ గున్నాగా... పాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచిలర్ నేనేలే...' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ప్రోమో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. తమన్ మ్యూజిక్ వేరే లెవల్‌లో ఉండగా రెబల్ మేనియా స్పెషల్ వైబ్ ఇచ్చింది.
#SahanaSahana is set to become everyone’s favourite from DEC 17th 😍😍#TheRajaSaab#Prabhas @DirectorMaruthi @MusicThaman pic.twitter.com/9KWq6Zt8Qs
— The RajaSaab (@rajasaabmovie) December 14, 2025
Also Read : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్‌లో మూవీ చేస్తుండడంతో 'ది రాజా సాబ్' ఫస్ట్ నుంచీ బిగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. వింటేజ్ ప్రభాస్‌ను గుర్తు చేసేలా డైరెక్టర్ మారుతి ఈ మూవీని రూపొందిస్తున్నారు. టీజర్, ట్రైలర్, లుక్స్ అదిరిపోయాయి. ఇప్పటివరకూ ఎన్నడూ చూడని విధంగా డార్లింగ్‌ను చూపించబోతున్నారు.
ప్రభాస్ సరసన మాళివిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా... బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మూవీ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇంటర్నేషనల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న వరల్డ్ వైడ్‌గా పాన్ ఇండియా స్థాయిలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.





















