అన్వేషించండి

Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు

Cars under Rs 10 Lakhs |: తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే కార్ల కోసం చూస్తున్నారా? అయితే మారుతి, హ్యుందాయ్ కంపెనీల నుంచి కొన్ని ఉత్తమ కార్ల గురించి తెలుసుకోండి.

Top Mileage Cars in India | భారతదేశ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న కారణంగా ఇప్పుడు కేవలం స్టైల్, ఫీచర్లను మాత్రమే కాకుండా మైలేజ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ మీ బడ్జెట్ రూ. 10 లక్షలు అయితే, మార్కెట్‌లో ఈ ధరలో పలు కంపెనీల ఉత్తమ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు అద్భుతమైన ఇంధన సామర్థ్యంతో పాటు లగ్జరీ, ప్రీమియం ఫీచర్లు సహా మోడ్రన్ లుక్‌తో వస్తాయి. ఈ కార్ల గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఆల్టో K10

మీరు తొలిసారి కారు కొనుగోలు చేయాలనుకుంటే, బడ్జెట్ పరిమితంగా ఉంటే, మారుతి ఆల్టో K10 ఒక అద్భుతమైన ఎంపిక. దీని ధర రూ. 3.7 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. Maruti Suzuki Alto K10 కారు దాదాపు 24.8 km/l మైలేజ్ ఇస్తుంది. ఆల్టో K10 కాంపాక్ట్ సైజు, తక్కువ మెయింటనెన్స్ ఖర్చు, సులభమైన నిర్వహణ కారణంగా కొత్త డ్రైవర్లకు ఇది ఫేమస్ అయింది. రోజువారీ ఆఫీసుకు వెళ్లడానికి లేదా నగరంలో రోజువారీ చిన్న ప్రయాణాల కోసం నమ్మదగిన, చవకైన కారు మారుతి ఆల్టో కే10.

మారుతి సుజుకి వాగన్ R

మారుతి వాగన్ R భారతదేశంలో అత్యంత నమ్మదగిన, కస్టమర్ల పొందిన ఫ్యామిలీ కార్లలో ఒకటి. దాదాపు రూ. 5 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారు గరిష్టంగా 26.1 km/l మైలేజ్ ఇస్తుంది. దీని అధిక సీటింగ్ పొజిషన్, పెద్ద క్యాబిన్ స్పేస్, మెరుగైన వీక్షణ దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. మారుతి వాగన్ ఆర్ (Maruti WagonR) నగర ట్రాఫిక్‌లో కూడా చాలా సులభమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అందుకే ఇది చాలా మందికి ఆల్-రౌండర్ ఎంపికగా మారింది. 

హ్యుందాయ్ ఎక్స్‌టర్

మీరు కారు స్టైల్, మైలేజ్ రెండూ కోరుకునే వారు అయితే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఒక అద్భుతమైన ఎంపికగా చెప్పవచ్చు. ఈ కారు దాదాపు రూ. 5.7 లక్షల ప్రారంభ ధరకు లభిస్తుంది. ఎక్స్‌టర్ కారు 19 km/l వరకు మైలేజ్ ఇస్తుంది. ఎక్స్‌టర్ దాని ఆధునిక SUV లుక్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, ఫీచర్-రిచ్ ఇంటీరియర్ కారణంగా యువతను బాగా ఆకర్షిస్తోంది. బడ్జెట్‌లో SUV లాంటి లుక్, ఫీల్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.

టాటా పంచ్

టాటా పంచ్ (Tata Punch) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో SUVలలో ఒకటి. దీని బేస్ మోడల్ దాదాపు రూ. 6 లక్షలకు మార్కెట్లో లభిస్తుంది. టాటా పంచ్ దాదాపు 18 km/l మైలేజ్ ఇస్తుంది. టాటా పంచ్ దాని బలమైన బిల్డ్ క్వాలిటీ, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో ఫేమస్ అయింది. ప్రీమియం ఇంటీరియర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎత్తు-సర్దుబాటు సీట్లు వంటి ఫీచర్లు ఇచ్చారు. చిన్న కుటుంబాలకు సురక్షితమైన, స్టైలిష్, నమ్మదగిన SUV టాటా పంచ్.

Also Read: Mahindra New SUV: మహీంద్రా XUV7XO బుకింగ్, లాంచ్ డేట్ ఫిక్స్.. ధర ఎంత, కొత్త టీజర్ లో ఇవి గమనించారా

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Advertisement

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
Embed widget