The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
The Paradise Making Video : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మూవీ టీం నుంచి బిగ్ సర్ ప్రైజ్ వచ్చింది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

Nani's The Paradise Movie Making Video Out : నేచరల్ స్టార్ నాని, 'దసరా' ఫేం శ్రీకాంత్ ఓదెల కాంబో రాబోతోన్న అవెయిటెడ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ది ప్యారడైజ్'. వచ్చే ఏడాది మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఓ డిఫరెంట్ రోల్‌లో నానిని చూపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ శ్రీకాంత్ బర్త్ డే సందర్భంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.
డైరెక్టర్ విజన్... మేకింగ్ అదిరెన్
స్వతహాగా ఇంట్రోవర్ట్ అయిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సెట్స్‌లో మాత్రం మాన్‌స్టర్ అంటూ మూవీ టీం తెలిపింది. తనదైన జోష్, మార్క్‌తో సెట్‌లో ఆయన వర్క్ డెడికేషన్, బిహేవియర్ వేరే లెవల్. ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఆయన వివరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. 'రక్తం పడినప్పుడే చరిత్ర ఓపెన్ అవుతుంది.' అంటూ ఆయన చెప్పే డైలాగ్ ఆయన విజన్‌ను ఎలివేట్ చేస్తోంది. ఏ ఫ్రేమ్ ఎలా ఉండాలో చూపిస్తూ... బురదలోనే కూర్చుని సిబ్బందికి ఆయన ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Introvert and calm by nature 🤗
— THE PARADISE (@TheParadiseOffl) December 14, 2025
Extremely passionate and expressive on the sets 🔥❤️🔥
That's our Silent Monster @odela_srikanth for you all.
Team #TheParadise wishes you a very Happy Birthday ❤🔥
In CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.
Releasing in Telugu, Hindi, Tamil,… pic.twitter.com/lQeXZ4ssta
Also Read : పవర్ స్టార్ స్టెప్స్... సోషల్ మీడియా షేక్స్ - యూత్‌కు కనెక్ట్ అయ్యే 'దేఖ్‌లేంగే సాలా' లిరిక్స్
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన 'దసరా' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత 'ది ప్యారడైజ్' ప్రాజెక్టుపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, టైటిల్ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. 1960 బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా మూవీ తెరకెక్కుతుండగా... ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్‌ను డైరెక్టర్ సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నారు.
ఈ మూవీలో 'జడల్'గా నాని కనిపిస్తుండగా... నెగిటివ్ రోల్‌లో 'శికంజి మాలిక్'గా సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఆయన లుక్ వేరే లెవల్‌లో ఉంది. అలాగే, బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జ్యూయెల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న వరల్డ్ వైడ్‌గా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్, స్పానిష్ ఇలా 8 భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. లాస్ట్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి మోహన్ బాబు లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... త్వరలోనే ఇతర అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.





















