Premante OTT : ఓటీటీలోకి లవ్ రొమాంటిక్ కామెడీ 'ప్రేమంటే' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Premante OTT Streaming : ప్రియదర్శి రీసెంట్ లవ్ రొమాంటిక్ కామెడీ మూవీ 'ప్రేమంటే' ఓటీటీలోకిి వచ్చేస్తోంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Priyadarshi's Premante OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి, ఆనంది జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'ప్రేమంటే'. గత నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ఈ నెల 19 నుంచి ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. 'అందమైన వైభవాల వేడుకే కదా ప్రేమంటే' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మూవీకి నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. ప్రియదర్శి, ఆనందిలతో పాటు యాంకర్ సుమ కనకాల, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, అభయ్ బేతిగంటి, సురభి ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Andhamaina vaibhavala veduka ey kadha premante 🤩❤️ pic.twitter.com/NF7ic6xETm
— Netflix India South (@Netflix_INSouth) December 14, 2025
Also Read : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
స్టోరీ ఏంటంటే?
ఫ్యామిలీ బాధ్యతలు కలిగిన యువకుడు మధుసూదన్ అలియాస్ మది (ప్రియదర్శి). లైఫ్ థ్రిల్లింగ్‌గా సాగాలనుకునే యువతి రమ్య (ఆనంది). అనుకోని కారణాలతో దొంగగా మారిన మది... ఓ రోజు పెళ్లిలో రమ్యను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయి. తాను చేస్తున్న పని దాచిపెట్టి పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇదే టైంలో భర్త దొంగ అని తెలిసిన ఆనంద అవి మానేసి జాబ్ చేయమని చెప్తుంది. దీంతో అలానే చేస్తాడు మది.
ఆ తర్వాత వారి జీవితాల్లో ఏం జరిగింది? భర్తను దొంగతనాలు మానేయమని చెప్పిన భార్యే మళ్లీ ఎందుకు చోరీలు చేయాలని చెప్పింది? ఈ కేసును హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరీ (సుమ కనకాల) ఎలా సాల్వ్ చేసింది? సిటీల్లో జరిగిన వరుస దొంగతనాల్లో బిర్యానీ ఎలాంటి పాత్ర పోషించింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















