Mowgli First Day Collection : రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Mowgli Day 1 Collection : యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల 'మోగ్లీ' ఓపెనింగ్ డే కలెక్షన్స్ పర్వాలేదనిపించింది. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.

Roshan Kanakala's Mowgli First Day Collections : యాంకర్ సుమ కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ కనకాల, 'కలర్ ఫోటో' ఫేం సందీప్ రాజ్ కాంబోలో వచ్చిన రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'మోగ్లీ'. ఈ నెల 13న రిలీజై బాక్సాఫీస్ వద్ద పాజిటవ్ టాక్ తెచ్చుకున్న మూవీ ఓ మాదిరి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ మేరకు ఫస్ట్ డే కలెక్షన్స్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.
ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఈ మూవీ ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్ షోస్‌తో కలిపి రూ.1.22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు టీం వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మూవీలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటించారు.
వీరితో పాటే విలన్‌గా బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 12నే మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా... 'అఖండ 2' రిలీజ్ కావడంతో ఒక రోజు వాయిదా పడింది.
View this post on Instagram
Also Read : అతనికి 53... ఆమెకు 38... ప్రేయసితో 'భగవంత్ కేసరి' విలన్ ఎంగేజ్‌మెంట్
స్టోరీ ఏంటంటే?
మురళీ కృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ కనకాల) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారతాడు. దీంతో ఊరి పక్కనే ఉన్న అడవినే తన అమ్మగా భావించి అక్కడే ఉంటూ షూటింగ్స్ కోసం వచ్చే సినిమా యూనిట్స్‌కు సాయం చేస్తుంటాడు. అలా వచ్చిన డబ్బులతో మెంటెయిన్ అవుతాడు. చిన్నప్పటి నుంచి ఎస్సై కావాలనేది అతని కల. ఈ క్రమంలో ఓ సినిమాకు డూప్‌లా నటించాల్సి వస్తుంది. అలా ఓ మూవీ షూటింగ్ కోసం వచ్చిన డ్యాన్సర్ జాస్మిన్ (సాక్షి మడోల్కర్) ను తొలి చూపులోనే ఇష్టపడతాడు.
ఆమె మూగ చెవుడు అని తెలిసే ప్రేమిస్తాడు. జాస్మిన్ కూడా మోగ్లీని ఇష్టపడుతుంది. ఇదే టైంలో ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) కన్ను ఆమె మీద పడుతుంది. జాస్మిన్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే, జాస్మిన్ మోగ్లీల ప్రేమ విషయం తెలిసి వారిద్దరినీ ఎలాగైనా విడదీయాలని భావిస్తాడు. మోగ్లీపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడతాడు. ఈ క్రమంలో మోగ్లీ జాస్మిన్‌ను తీసుకుని అడవిలోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? క్రిస్టోఫర్ నుంచి జాస్మిన్‌ను మోగ్లీ ఎలా రక్షించాడు? క్రిస్టోఫర్‌కు ముందు మోగ్లీ జాస్మిన్‌లను విడదీయాలని చూసింది ఎవరు? వీరిద్దరి లవ్ సక్సెస్ అయ్యిందా? మోగ్లీ తన ఎస్సై కల సాధించుకున్నాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















