Masaka Masaka Song : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
Masaka Masaka Full Song : తెలుగు పాప్ సింగర్ స్మిత మరో సరికొత్త ప్రయోగం చేశారు. ఓల్డ్ రొమాంటిక్ సాంగ్ 'మసక మసక చీకటిలో...'కు ర్యాప్ జోడించి ప్రస్తుతం ట్రెండ్‌కు అనుగుణంగా రిలీజ్ చేశారు.

Smitha's Masaka Masaka OG Mix Song : తెలుగు ఓల్డ్ సాంగ్స్‌ను రీమిక్స్ చేసి తెలుగు పాప్ సింగర్‌గా ఫేమస్ అయ్యారు సింగర్ స్మిత. ఆమె పాడిన 'మసక మసక చీకటిలో' ఆమె కెరీర్‌లోనే ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఒకప్పటి మూవీ 'దేవుడు చేసిన మనుషులు' (1973) నుంచి ఈ పాటను రీమేక్ చేసి ట్రెండ్ క్రియేట్ చేశారు. 2000 సంవత్సరంలో ఈ పాట రీమేక్‌తో అదుర్స్ అనిపించారు.
ఇప్పుడు మరోసారి అదే పాటపై సరికొత్త ప్రయోగం చేశారు. పాత పాటకు సరికొత్త రీమిక్స్ రూపం ఇచ్చి ర్యాప్ జోడించి న్యూ వీడియో రిలీజ్ చేశారు. నటుడు, ఫ్రెండ్ ర్యాపర్ నోయల్‌తో కలిసి ఆమె స్టెప్పులేశారు. ఇప్పటికే స్మిత కెరీర్‌లో సిగ్నేచర్ హిట్‌గా పేరొందిన ఈ పాట... సరికొత్త వెర్షన్ మరో ట్రెండ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. నోయల్, స్మిత కలిసి ఎన్నెన్నో ఆల్బమ్స్ చేయగా అవి ఫేమస్ అయ్యాయి. 'బాహుబలి' రిలీజ్ టైంలో పాపులర్ అయిన 'కిలికి' భాష నుంచి 'వహా కిలికి' అంటూ సాంగ్ తీసి సూపర్ అనిపించారు.
Also Read : ఎయిర్ పోర్టులో సమంత, రాజ్ నిడిమోరు - పెళ్లి తర్వాత ఫస్ట్ టైం కనిపించిన న్యూ కపుల్
ఈటీవీ 'పాడుతా తీయగా' షోతో పాపులర్ అయ్యారు స్మిత. ఫైనల్లో విజేత కాకపోయినా తన గాత్రంతో అందరి మనసులు దోచేశారు. ఆ తర్వాత సినిమాల్లో పాడేందుకు అవకాశాలు వచ్చాయి. ఆమె గొంతు పాప్ సాంగ్స్‌కు సరిపోతుందని భావించి ఆ దిశగా కెరీర్ ప్రారంభించారు. 'హాయ్ రబ్బా' ఆల్బమ్ రూపొందించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుసగా పాపులర్ ఆల్బమ్స్ చేశారు. అప్పటి పాటలను రీమిక్స్ చేసి ఇప్పటి ట్రెండ్‌కు సరిపోయేలా రిలీజ్ చేశారు. 'జీ తెలుగు' సరిగమప షోలో న్యాయ నిర్ణేతగానూ వ్యవహరించారు. కెరీర్ పరంగానే కాకుండా వ్యాపారవేత్తగానూ రాణించారు.






















