Raju Weds Rambai OTT : 'రాజు వెడ్స్ రాంబాయి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Raju Weds Rambai OTT Platform : రీసెంట్ విలేజ్ కల్ట్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్‌లో మూవీ స్ట్రీమింగ్ కానుంది.

Akhil Raj's Raju Weds Rambai OTT Release Date Locked : చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకున్న రీసెంట్ విలేజ్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి' ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ మూవీలో అఖిల్ రాజ్, తేజస్వీ రావు ప్రధాన పాత్రలో నటించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా... చైతు జొన్నలగడ్డ, శివాజీ రాజా, అనిత చౌదరి, కవిత శ్రీరంగం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ విన్ ప్రొడక్షన్ హౌస్ సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించగా... వంశీ నందిపాటి, బన్నీ వాస్ రిలీజ్ చేశారు.
Also Read : 'పుష్ప 2' రికార్డు బ్రేక్ చేసిన రణవీర్ 'ధురంధర్' - వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
స్టోరీ ఏంటంటే?
ఉమ్మడి ఏపీ వరంగల్ ఖమ్మం మధ్య ఓ పల్లెటూరిలో జరిగిన లవ్ స్టోరీ ఇది. గ్రామంలో రాజు (అఖిల్ రాజ్) బ్యాండ్ కొట్టడంలో ఫేమస్. చుట్టుపక్కల ఊళ్లో ఏ వేడుకైనా అతన్నే పిలుస్తారు. అదే ఊరికి చెందిన రాంబాయి (తేజస్వి రావు)ని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు రాజు. మొదట్లో అతని ప్రేమను వ్యతిరేకించినా ఆ తర్వాత రాజు నిజాయతీ చూసి ఇష్టపడుతుంది రాంబాయి. అయితే, ఆమె తండ్రి వెంకన్న (చైతు జొన్నలగడ్డ) కూతురిని ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆమెను ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్లి చేయాలని అనకుంటాడు.
ఈ క్రమంలో రాజు, రాంబాయి తమ పెళ్లికి ఒప్పుకొనేందుకు ఓ ప్లాన్ వేస్తారు. పెళ్లికి ముందే ఆమెను గర్భవతిని చేస్తే తండ్రి కచ్చితంగా పెళ్లికి అంగీకరిస్తాడని అనుకుంటాడు. ఇందుకు రాంబాయి కూడా ఓకే అంటుంది. అలా చేసిన తర్వాత ఏం జరిగింది? విషయం తెలిసిన వెంకన్న ఏం చేశాడు? రాజు రాంబాయిలు ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















