Dhandoraa : 'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
Dhandoraa Title Song : లేటెస్ట్ సోషల్ ఓరియెంటెడ్ డ్రామా 'దండోరా' నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సామాజిక అంశాలు ప్రతిబింబిస్తూ కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు.

Sivaji's Dhandoraa Title Song Lyrics : సీనియర్ హీరో శివాజీ, బిందు మాధవి, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సోషల్ ఓరియెంటెడ్ మూవీ 'దండోరా'. తెలంగాణ గ్రామీణ నేపథ్యం, సమాజంలో అసమానతలు, ఇతర సామాజిక అంశాలే ప్రధానాంశంగా మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది.
తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటను ఆంథోనీ దాసన్, మార్క్ కె రాబిన్ పాడారు. సామాజిక అంశాలను టచ్ చేస్తూ ప్రముఖ రైటర్ కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. కె రాబిన్ మ్యూజిక్ అందించారు.
ఆలోచింపచేసే లిరిక్స్
పల్లవి
నిను మోసినా నను మోసినా అమ్మ పేగు ఒకటేనన్నా...
నిను కోసినా నను కోసినా రాలే రగతం ఎరుపేనన్నా...
చిన్న పెద్దా తేడా ఎట్లొచ్చెరా... నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా...
ముట్టుకుంటే మైల ఎట్లయ్యరా... కొట్టి కొట్టి గుండె డప్పెయ్యరా...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దండోరా...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దండోరా...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దండోరా...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దండోరా...
చరణం 1
ఎన్ని తరాలైనా గాయం మానేనా... నరకబడుతున్న తల నాదేనా...
చందురిని పైనా అడుగే పెడుతున్నా ఊరి చివర నే ఉరి నాకేనా...
బడి గుడికి పొలంబడికి గబ్బిలాన్నై నే పోలేనా...
బట్ట పొట్టకి కాలే కట్టెకి కంఠ నీతితో కొట్లాటేనా...
సమాధి మీద పువ్వే నా ప్రేమ... అర్ధరాత్రుల్లో మసి అయ్యేనా...
శవాలు కూడా సిగాలు ఊగే... జాతరొస్తుందీ చూస్తుండన్నా...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దన్ దండోరా...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దన్ దండోరా...
చరణం 2
గుప్పెడంత ఉన్నా నిప్పు మీరన్నా... తగలబడుతున్న గుడిసె మాది
హాయిగా నే ఉన్నా గుంపు మీదన్నా... పిండుకుంటున్నా సెమటే మాది
మట్టి బతుక్కి యెట్టి బతుక్కి రాసిందెవడో ఆ ఎనకటికి
ఒంటి సుఖంకి ఇంకో ముఖంకి నలిపేస్తుండ్రూ మమ్మిప్పటికీ...
సూరీడొచ్చిండు చట్టం తెచ్చిండు... అయినా హత్యలే మీ పరువుకి
నాదీ అంటున్నవ్ మాదీ అంటున్నవ్ మనది అనాలే ముమ్మాటికీ...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దండోరా...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దండోరా...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దండోరా...
దండోరా... దండోరా... దన్ దన్ దన్ దండోరా...
Also Read : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
'కలర్ ఫోటో', 'బెదురులంక 2021' మూవీస్ నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్ రవీంద్రరెడ్డి 'దండోరా' మూవీని నిర్మిస్తున్నారు. శివాజీ, బిందు మాధవి, నవదీప్‌లతో పాటు మౌనికా రెడ్డి, రవికృష్ణ, అనూష, మనికా చిక్కాల, రాద్యా తదితరులు కీలక పాత్రలు పోషించారు. అదితి భావరాజు సైతం కీ రోల్ ప్లే చేశారు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





















