Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. ఫిబ్రవరి 15 నుంచి ట్రైన్ టైమింగ్స్ మారుతున్నట్టు వెల్లడించింది.

Janmabhoomi Express Timings: తెలుగు రాష్ట్రాల మధ్య అతి ముఖ్యమైన రైలు మార్గంలో ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఒక కీలకమైన అప్‌డేట్‌ను అందించింది. విశాఖపట్నం- లింగంపల్లి మధ్య నడిచే అత్యంత ప్రజాదరణ పొందిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులు తక్షణమే కాకుండా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మార్పులు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి.
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కొత్త టైమింగ్స్ ఏంటీ?
జన్మభూమి ఎక్స్‌ప్రెస్... విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతం లింగంపల్లి వరకు ప్రయాణించే మార్గంలో ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక ప్రధాన ప్రాంతాలను, కలుపుతుంది. దీని సూపర్ ఫాస్ట్ హోదా, అనుకూలమైన పగటిపూట ప్రయాణం కారణంగా ఇది ఎల్లప్పుడూ రద్దీగా ఉంటోంది. ఈ రైలు వేళల్లో సమన్వయం, లేదా ఆయా సెక్షన్‌లలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఏ శ్రీధర్ ఈ కొత్త వేళల వివరాలను ప్రకటించారు.
విశాఖపట్నం నుంచి లింగంపల్లి; రైలు నంబర్ 12806 పాత షెడ్యూల్‌తో పోలిస్తే కొద్దిగా మార్పులను చేసింది. ఈ రైలు విశాఖపట్నంలో ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బయల్దేరుతుంది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం అదే రోజు రాత్రి 7.15గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది.
లింగంపల్లి నుంచి విశాఖపట్నం; తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 12805 లింగంపల్లి నుంచి ఉదయం 6.55 గంటలకు బయల్దేరుతుంది. ఇది రాత్రికి రాత్రే ప్రయాణం చేయకుండా పగటిపూట ప్రయాణాన్ని పూర్తి చేసి, విశాఖకు రాత్రి 7.50 గంటలకు చేరుకుంటుంది.
పాత షెడ్యూల్‌తో పోలిస్తే ఈ కొత్త వేళల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ ప్రయాణికులు ఫిబ్రవరి 15 నుంచి ప్రయాణానికి ముందు తమ టికెట్లను, కొత్త వేళలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి. ఈ రైలుకు నిత్యం ఉండే డిమాండ్ దృష్ట్యా ఐదు నిమిషాల ఆలస్యంగా లేదా ముందుగా బయల్దేరినా అది వందల మంది ప్రయాణికుల ఇంటర్ కనెక్టివిటీకి, కార్యకలాపాలపై ప్రభావం పడుతుంది.
సంక్రాంతికి రద్దీకి ప్రత్యేక రైళ్ల పొడిగింపు
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైంలో మార్పు ఒకవైపు అమలు కానుండగా మోరవైపు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక వీక్లీ, డైలీ, రైళ్లను వేసింది. వాటిని మరింత కాలం పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.





















