Vijay Trisha: జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
Vijay Trisha Attending Wedding: తమిళ నిర్మాత కల్పాత్తి ఎస్ సురేష్ తనయుడి వెడ్డింగ్ రిసెప్షన్‌లో దళపతి విజయ్, కథానాయిక త్రిష జంటగా కనిపించారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఎందుకంటే...

టీవీకే పార్టీ అధినేత, కోలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకరైన దళపతి విజయ్ (TVK Vijay), కథానాయిక త్రిష (Trisha Krishnan) జంటగా ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌కు వచ్చారు. అదీ తమిళ నిర్మాత, వ్యాపారవేత్త కల్పాత్తి ఎస్ సురేష్ తనయుడి రిసెప్షన్‌లో. శుభ కార్యక్రమానికి సంబంధించిన వేడుకకు, అదీ ఓ నిర్మాత కుటుంబంలో జరిగిన వేడుకకు హీరో హీరోయిన్లు కలిసి వెళ్లడంలో తప్పు ఏమిటి? అని కొందరు ప్రశ్నలు వేయవచ్చు. విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో, తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు చేసిన తరుణంలో... విజయ్ - త్రిష జంటగా కనిపించడం చర్చకు దారి తీసింది.
రూమర్లకు చెక్ పెడుతూ... నిజం చేస్తూ!
విజయ్ - త్రిష మధ్య సంబంధం ఉందని తమిళ రాజకీయ వర్గాల నుంచి కొన్ని రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి. త్రిష నుంచి బయటకు వచ్చి రాజకీయం చేయాలని విజయ్ ప్రత్యర్థులు విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే... త్రిష పేరు చెప్పకపోయినా ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని సంగీత ఆరోపించడంతో అందరి వేళ్ళూ త్రిష వైపుకు వెళ్లాయి. ఈ తరుణంలో త్రిషతో జంటగా కనిపించారు విజయ్.
Also Read: Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
ఇప్పటి వరకు విజయ్ - త్రిష మధ్య ఏదో సంబంధం ఉందని రూమర్లు మాత్రమే వచ్చాయి. అయితే ఇద్దరూ జంటగా కనిపించడం వల్ల ఆ రూమర్లను నిజం చేశారా? అంటే... 'అవును' అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎటువంటి విమర్శలకు తావు ఇవ్వకుండా తామిద్దరం జంట అని విజయ్ - త్రిష స్పష్టంగా చెప్పినట్టు అయ్యింది.
Also Read: Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
#Thalapathy @TVKVijayHQ President #Vijay and #Trisha attend #KalpathiSSuresh - #MeenakshiSuresh 's son wedding reception @actorvijay @trishtrashers pic.twitter.com/iQOQet9Z0A
— Nikil Murukan (@onlynikil) March 5, 2026
దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విజయ్!
హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడం వంటివి గతంలో జరిగాయి. పెళ్లైన హీరోతో ప్రేమలో పడిన హీరోయిన్లు సైతం ఉన్నారు. విడాకులు తీసుకోవడం లేదా మత మార్పిడిని ఆశ్రయించి (ఇస్లాం స్వీకరించి) హీరోయిన్లను పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు, నిర్మాతలు ఉన్నారు. అయితే... ఇక్కడ విజయ్ వ్యవహారం వేరు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత, అదీ ఎన్నికలకు ముందు ఆయన నుంచి భార్య విడాకులు కోరారు. అదీ తన భర్తకు మరొక మహిళతో సంబంధం ఉందని! ఇప్పుడు ఈ అంశం ప్రత్యర్థులకు ఆయుధంగా మారవచ్చని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ట్రెండింగ్ వార్తలు



















