అన్వేషించండి

Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే

Telangana Governor |తెలంగాణకు కొత్త గవర్నర్‌గా శివ్‌ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ తెలంగాణకు బదిలీ అయ్యారు. మొత్తం 9 రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించింది.

న్యూఢిల్లీ/ హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్‌ వర్మ మహారాష్ట్రకు బదిలీ కాగా, ఆయన స్థానంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ శివ్‌ప్రతాప్‌ శుక్లా తెలంగాణ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. మొత్తం గవవర్నర్ నియామకాల్లో ఐదుగురిని బదిలీ చేయగా, ముగ్గురిని కొత్తగా నియమించారు. బిహార్ గవర్నర్‌గా ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ స్థానంలో సయ్యెద్‌ అటా హస్నైన్‌ నియమితులయ్యారు.

శివ్‌ప్రతాప్‌ శుక్లా రాజకీయ ప్రస్థానం
తెలంగాణ కొత్త గవర్నర్ శివ్‌ప్రతాప్‌ శుక్లా 1952లో యూపీలోని గోరఖ్‌పుర్‌లో జన్మించారు. రుద్రాపూర్‌లో స్కూల్ ఎడ్యుకేషన్, గోరఖ్‌పూర్‌లో కాలేజీ చేశాక, తరువాత లా పట్టా అందుకున్నారు. ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 1989లో గోరఖ్‌పూర్ నుంచి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్, రాజ్‌నాథ్ సింగ్‌ల మంత్రివర్గాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1991, 1993, 1996 ఎన్నికల్లోనూ విజయం సాధించి పలు పదవులు చేపట్టారు. 2016లో జూన్ 10న ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2022 జులై 5 వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. 2023 ఫిబ్రవరి 16 నుంచి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న శివ్ ప్రతాప్ శుక్లా తాజాగా తెలంగాణ గవర్నర్‌గా బదిలీ అయ్యారు.  

జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ..

తెలంగాణ రాష్ట్రానికి నాలుగో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన జిష్ణుదేవ్‌ వర్మ, దాదాపు 20 నెలల పాటు తన విశిష్ట సేవలను అందించారు. 2024 జులై 31న పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన, కేవలం రాజ్యాంగబద్ధమైన విధులకే పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలోనూ చురుగ్గా వ్యవహరించారు. స్వతహాగా కవి మరియు రచయిత కావడంతో రాష్ట్రంలోని సాహిత్య కార్యక్రమాలపై ప్రత్యేక ఆసక్తి కనబరిచేవారు. ముఖ్యంగా స్థానిక ప్రజలతో మమేకం కావడానికి ఆయన తెలుగులో మాట్లాడటం, జిల్లాల వారీగా పర్యటించడం వంటి అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

పరిపాలనా పరంగా జిష్ణుదేవ్ వర్మ హయాంలో అనేక కీలక నిర్ణయాలు అమలులోకి వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆయన ఆమోదముద్ర వేయడంతో సామాజిక న్యాయానికి మార్గం సుగమమైంది. అలాగే, పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఉద్దేశించిన కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామపంచాయతీల విలీనం, జీహెచ్‌ఎంసీ విభజన ఆర్డినెన్స్‌లకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతేడాది మార్చిలో బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌' వంటి ఆర్థిక ప్రగతికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.

విద్యా రంగం పరంగా చూస్తే, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వైస్ ఛాన్సలర్ల (VCs) నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం జిష్ణుదేవ్‌ వర్మ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఒకవైపు సాహిత్య ప్రియుడిగా, మరోవైపు నిర్ణయాత్మక శక్తిగా తెలంగాణ అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయ్యారు. 

పశ్చిమ బెంగాల్ గవర్నర్ కీలక నిర్ణయం.. రాజీనామాతో షాక్
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్‌ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకానున్న తరుణంలో ఈ నిర్ణయం రాజకీయంగా కలకలం రేపింది. 2027 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన తప్పుకోవడం వెనుక కేంద్రం ఒత్తిడి ఉండొచ్చని సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాజీనామాను ఆమోదించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Maandhan Yojana Scheme 2026: రైతులు, కార్మికులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. పీఎం మాన్ ధన్ యోజన్ పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే?
రైతులు, కార్మికులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. పీఎం మాన్ ధన్ యోజన్ పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే?
Hyderabad ATM Scam: హైదరాబాద్‌లో ఏటీఎంలో పెట్టాల్సిన 1.2 కోట్ల నగదు మాయం, పరారీలో ఇద్దరు ఉద్యోగులు!
హైదరాబాద్‌లో ఏటీఎంలో పెట్టాల్సిన 1.2 కోట్ల నగదు మాయం, పరారీలో ఇద్దరు ఉద్యోగులు!
TS Inter Results 2026 District Wise: ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా.. జిల్లాలవారీగా పాస్ పర్సంటేజీ లెక్కలు చూశారా
ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా.. జిల్లాలవారీగా పాస్ పర్సంటేజీ లెక్కలు చూశారా
TS Inter Results 2026 District Wise: ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో టాప్ లేపిన మేడ్చల్.. చివరి స్థానంలో ఏ జిల్లా..
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో టాప్ లేపిన మేడ్చల్.. చివరి స్థానంలో ఏ జిల్లా..
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌కు ఆయుధాలిస్తే చైనాపై 50 శాతం టారిఫ్.. కోపంతో రగిలిపోతున్న డొనాల్డ్ ట్రంప్
Revanth Plan With KK: ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
ఇంటర్ ఫలితాలను కేకే రిలీజ్ చేయడం వెనుక రాజకీయం - రేవంత్ ప్రాధాన్యత దేనికి సంకేతం?
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
Inter Student Suicide: ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
ఫెయిల్ భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, రిజల్ట్స్ చూస్తే పాస్.. ఖమ్మం జిల్లాలో ఘటన
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
బీఆర్ఎస్‌ను మళ్లీ TRS గా పేరు మార్చడంపై ఆలోచిస్తున్నాం.. పాదయాత్ర చేస్తా: కేటీఆర్
Khajipet Inter Girl Murder Case: నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
నా కొడుకు అమాయకుడు.. నన్ను హత్తుకుని ఏడ్చాడు: ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి ఆవేదన
TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
Adivi Sesh: సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
సుప్రియా... నువ్వు నాకెంతో ముఖ్యం - ఓపెన్‌గా చెప్పిన అడివి శేష్
Embed widget