అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
భారత యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ యూఏఈతో జరిగిన U-19 ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించి రికార్డుల మోత మోగించాడు. వైభవ్ సూర్యవంశీ 95 బంతుల్లో 9 ఫోర్లు, 14 సిక్సర్లతో ఏకంగా 171 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీని కొద్దిలో మిస్ అయినా.. 17 ఏళ్ల ప్రపంచ రికార్డును మాత్రం బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఇదే కాదు అండర్-19 వన్డే మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా వైభవ్ World రికార్డు క్రియేట్ చేశాడు.
2008లో నమీబియాపై ఆస్ట్రేలియాకు చెందిన మైకేల్ హిల్ 12 సిక్సర్లతో 124 పరుగులు చేసి నెలకొల్పిన 17 ఏళ్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. యూఏఈపై వైభవ్ 14 సిక్సర్లు కొట్టి కొత్త వరల్డ్ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. ఇది ఇండియన్ బ్యాటర్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు కూడా. అయితే అంబటి రాయుడు పేరున ఉన్న అండర్-19 వన్డే మ్యాచ్‌లలో ఓ భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు రికార్డును వైభవ్ తృటిలో మిస్ చేసుకున్నాడు. 2002లో ఇంగ్లాండ్‌పై అంబటి రాయుడు 177 పరుగులు చేశాడు. మరో 6 పరుగులు చేసి ఉంటే వైభవ్ ఈ రికార్డ్ కూడా అందుకునే వాడు. అయితే అండర్-19 ఆసియా కప్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్ రికార్డ్ మాత్రం వైభవ్ దే. ఇంతకుముందు ఉన్ముక్త్ చంద్ (2012), అర్జున్ ఆజాద్ (2019) పాకిస్తాన్‌పై 121 చొప్పున పరుగులు చేశారు.





















