Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Pawan Kalyan : ఈ విషయంలో మాత్రం పవన్ కల్యాణ్‌కు సెల్యూట్ కొట్టాల్సిందే. ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టుకు డిప్యూటీ సీఎం అండగా నిలబడ్డారు.

Pawan Kalyan : మ్యాచ్ ఫీజులు వస్తే ఇల్లు గడుస్తుంది అనే ఆశతో వైకల్యం బాధ పెడుతున్నా ఎదురించి క్రికెట్ ఆడుతున్నట్టు తెలిపారు జమ్ము కాశ్మీర్‌కి చెందిన మహిళా క్రికెటర్ అనేఖా దేవి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అమరావతిలో కలిసిన అంధుల ప్రపంచ కప్ గెలిచిన మహిళా క్రికెటర్ ల సభ్యుల్లో ఆమె ఉన్నారు.
" మాది జమ్మూకశ్మీర్. నేను రెండేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను. జమ్మూకశ్మీర్‌కి ప్రత్యేక క్రికెట్ బోర్డు లేకపోవడంతో ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా తండ్రి విద్యుత్ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవారు. కొంతకాలంగా ఆయన ఆనారోగ్యం బారినపడడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. మ్యాచ్ ఫీజులతో ఇంటిని నడుపుకునే పరిస్థితి ఉంది. ఇలా ప్రోత్సాహం లభిస్తే ఆర్థిక ఇబ్బందులు తీరి ఆటపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుంది” అని అనేఖా దేవి తెలిపారు.
VIDEO | Indian Blind Women’s Cricket Team player Simu Das expressed deep gratitude after receiving financial assistance from Andhra Pradesh Chief Minister Pawan Kalyan, support she says will finally help her build her first home.
— Press Trust of India (@PTI_News) December 12, 2025
Originally from Assam, Simu said she never… pic.twitter.com/9LJQT0plKW
అనేఖా దేవి మాత్రమే కాదు ఆ జట్టులోని చాలా మంది కుటుంబ నేపథ్యాలు మనసును కదిలించేవే. వీరిలో ఏపీకి చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్‌లు కూడా ఉన్నారు. ఆ జట్టు సభ్యులను పిలిపించి వారితో మాట్లాడి 84 లక్షల రూపాయలను అందించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన్ను చూసి ఇతర రాష్ట్రాల నేతలు మారాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మ్యాచ్ ఫీజుతో అమ్మానాన్నల కడుపు నిండుతుందనే ఆడేవాళ్లం : దీపిక (శ్రీ సత్యసాయి జిల్లా), జట్టు కెప్టెన్
“ప్రపంచకప్ గెలిచిన జట్టులోకి 16 మంది అమ్మాయిలు చాలా కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చాం. మా కుటుంబాలకు ఒక్క పూట కడుపు నింపుకునేందుకు కూడా కష్టంగా ఉండేది. మాలో చాలా మంది అమ్మాయిలు క్రికెట్ ఆడితే మ్యాచ్ ఫీజు వస్తుందనే ఆడేవాళ్లం. మ్యాచ్ ఫీజుతో మా అమ్మానాన్నల కడుపు నింపవచ్చనే ఆడుతున్నాం. ప్రభుత్వం నుంచి మాకు సరైన సాయం అందితే అమ్మానాన్నలను బాగా చూసుకుంటాం. మాది శ్రీ సత్యసాయి జిల్లా, హేమవతి పంచాయతీ పరిధిలోని తంబలహట్టి తండా. మా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కూడా లేదు. రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఊరికి రోడ్డు వేయించండి” అని భారత అంధ మహిళా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన దీపిక తన మనసు లోని మాటను ఉప ముఖ్యమంత్రి తో పంచుకున్నారు.
Breaking...అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు మధ్యాహ్నం కోరిన రహదారులకు సాయంత్రానికల్లా పాలనా అనుమతులు 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు ❤️🙏 pic.twitter.com/Ibwt7AHMND
— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) December 12, 2025
DyCM @PawanKalyan congratulated women’s blind cricket team for winning the World Cup and donated 5 lakh each to the cricketers and 2 lakh each to the coaches
— Bhaskar (@BhachoJSP) December 13, 2025
No one can ever match Pawan Kalyan's generosity when it comes to giving money.
He promised to address every issue of… pic.twitter.com/V7Si9ch9qr
విజయం తర్వాత కూడా సరైన గౌరవం దక్కడం లేదు : అనూ కుమారి, ఢిల్లీ క్రికెటర్
“క్రికెట్లోకి రాక ముందు మాకు పూట గడవడానికి కూడా కష్టంగా ఉండేది. ఈ రోజున ఇంత విజయం సాధించిన తర్వాత కూడా సరైన గౌరవం దక్కడం లేదు. సాధారణ క్రికెటర్ల మాదిరి ప్రోత్సాహకాలు అందిస్తే మేము మరిన్ని విజయాలు సాధిస్తాం. మాకు ప్రాక్టీస్ చేయడానికి సాధారణ గ్రౌండ్లు పనికి రావు. బంతి శబ్దం స్పష్టంగా వినబడడానికి వీలుగా సౌకర్యాలు ఉండాలి. మేమంతా దూరంగా అడవుల మధ్య ఉన్న మైదానాలకు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాళ్లం. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోచ్, సౌకర్యాలు, ఆర్థిక భరోసా ఉంటే మేము మరిన్ని విజయాలు సాధిస్తామని" ఢిల్లీకి చెందిన క్రికెటర్ అనూ కుమారి బాధపడుతూ పవన్ కల్యాణ్‌తో తమ ప్రాక్టీస్ కష్టాల గురించి చెప్పారు.
క్రికెట్ జట్టు సభ్యులకు 84 లక్షలు ఇచ్చి సత్కారం చేసిన పవన్
వీరి గురించి విన్న పవన్ కళ్యాణ్ చలించిపోయి మొత్తం 16మంది జట్టు సభ్యులకు ఒకొక్కరికి 5 లక్షల చొప్పున 80లక్షలు సపోర్టింగ్ స్టాఫ్‌కి రెండేసి లక్షల చొప్పున 4 లక్షలు కలిపి మొత్తం 84 లక్షలు అందజేశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడడమే ప్రతీ ఒక్కరికీ పట్టు చీర, శాలువాతోపాటు ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు చెందిన జ్ఞాపిక,కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ అందించారు.
దీపిక ఊరికి రోడ్డు, కరుణ కుమారికి ఇల్లు వెంటనే మంజూరు
బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన మహిళల జట్టులోని ఇద్దరు తెలుగు అమ్మాయిలను వెంటనే ఆదుకునే నిర్ణయాలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం. సత్య సాయి జిల్లాకు చెందిన దీపిక సొంత ఊరు తంభల హట్టి తండాకు రోడ్డు సౌకర్యం, అల్లూరి జిల్లాకు చెందిన కరుణ కుమారికి సొంత ఇల్లు వెంటనే మంజూరు చేస్తూ పవన్ నిర్ణయాలు తీసుకున్నారు.
అంధుల క్రికెట్ కు పవన్ అండ కావాలి : అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి
"సరైన సౌకర్యాలు కల్పిస్తే అంధుల క్రికెట్ జట్టు ఏం చెయ్యగలదో మహిళా క్రికెటర్లు సాధించి చూపారు. గతంలో నలుగురు అంధ క్రికెటర్‌లకు పవన్ ఆర్థిక సాయం చేశారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో మాకు అండగా నిలిస్తే అద్భుతాలు సృష్టిస్తాం అన్నారు సీనియర్ బ్లైండ్ క్రికెట్ జట్టు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి
ప్రపంచ కప్ గెలిచిన క్రికెటర్ కు సొంత ఇల్లు లేదని తెలిసి బాధ పడ్డాను :పవన్
మహిళల జట్టు బ్లైండ్ క్రికెట్ లో ప్రపంచ కప్ గెలిచింది అని ఆనందపడ్డాను అయితే ఈలోపే వారి బాధలు చూసి కరిగిపోయాను. అందుకే అండగా నిలబడాలని ఇలా వాళ్ళని కలిశాను. వారు ఒక స్ఫూర్తి" అంటూ పవన్ పొగిడారు. అయితే దేశంలోని ఏ ఇతర రాష్ట్రానికి చెందిన మంత్రి కూడా కనీసం వారిని పట్టించుకున్న వాళ్లు లేరు. అదే సమయంలో పవన్ ఇలా వారికి అండగా నిలబడడం అనేది మాత్రం కచ్చితంగా ఆయనకు సెల్యూట్ కొట్టాల్సిన అంశమే అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి.





















