అన్వేషించండి

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్‌ యాదవ్‌ హైదరాబాద్‌లో పర్యటించి రేవంత్ రెడ్డి, కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Akhilesh Yadav Tour in Hyderabad: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్ హైదరాబాద్ పర్యటన ఆసక్తిగా మారింది. ఆయన ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తర్వాత ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో సమావేశమయ్యారు. త్వరలోనే కేసీఆర్‌తో భేటీ అవుతానంటూ ప్రకటించారు. ఒకే రోజు ఇలా అధికార పార్టీ, ప్రతిపక్ష నేతలతో సమావేశం కావడం రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తోంది. 

Image

సాయంత్రం హైదరాబాద్ వచ్చిన అఖిలేశ్ యాదవ్‌ ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న పరిణామాలు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ సమీకరణాలపై మాట్లాడుకున్నారని సమాచారం.

Image

తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, బీసీ రిజర్వేషన్ అమలు, ఇతర అభివృద్ధి అంశాలపై అఖిలేశ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ అనిల్‌, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌, రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు. 

Image

Image

ముఖ్యమంత్రితో సమావేశమైన కాసేపటికే అఖిలేశ్‌ యాదవ్‌ కేటీఆర్‌తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. అక్కడే ఉన్న హరీష్‌రావు, కేటీఆర్ ఆయనకు స్వాగతం పలికి వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. సమావేశంలో చర్చలు ముగిసిన తర్వాత ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. Image

అఖిలేశ్‌ యావద్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఒడిదుడుకు సహజమని ఒక్కోసారి ప్రజలు స్వీకరిస్తారు, మరోసారి వేరే వాళ్లకు అవకాశం ఇస్తారని అన్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటేనే వారు అర్థం చేసుకుంటారని అన్నారు. సమీక్షించుకొని ప్రజల కోసం నిలబడినప్పుడే వాళ్లు స్వీకరిస్తారని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకప్పుడు రెండు సీట్లు మాత్రమే సమాజ్‌వాదీ పార్టీకి వచ్చాయని తర్వాత ప్రజలు భారీ సీట్లు అప్పగించారని అన్నారు. ఇప్పుడు అక్కడ బీజేపీ రెండో స్థానానికి పరిమితమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌తో మాట్లాడానని త్వరలోనే కలుస్తానని కూడా వివరించారు. రాజకీయాలు దేశ ప్రగతికి దోహదపడాలని విజన్‌తో సాగాలని సానుకూల విమర్శలతో ఉండాలని అభిప్రాయపడ్డారు.  

Image

కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌ వచ్చిన అఖిలేశ్‌ను కలుద్దామని ఆయనే స్వయంగా వస్తానని చెప్పారని అన్నారు. అన్నట్టుగానే వచ్చారని తెలిపారు. గతంో పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చినా ప్రజల్లో ఉంటూ మళ్లీ నిలబడ్డారని అదే స్ఫూర్తితో తాము నిలబడతామని చెప్పుకొచ్చారు. వారి ఆశీర్వాదం పొందుతామని అశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
Advertisement

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
కార్యకర్త కుటుంబానికి పవన్ భరోసా - స్వయంగా ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పిన జనసేనాని!
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
Bangladesh: ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇండియాలో ఆడకపోతే స్కాట్లాండ్‌కు చోటు - బంగ్లాదేశ్‌కు తేల్చి చెప్పిన ఐసీసీ
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Embed widget