Dhurandhar Collection : 'పుష్ప 2' రికార్డు బ్రేక్ చేసిన రణవీర్ 'ధురంధర్' - వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
Dhurandhar Movie : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. తాజాగా అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ రికార్డును బ్రేక్ చేసింది.

Ranveer Singh Dhurandhar Movie Breaks Pushpa 2 Records : బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధిస్తోంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా బాలీవుడ్‌లో మరో రికార్డు బ్రేక్ చేసింది.
'పుష్ప 2' రికార్డు బ్రేక్
ఇప్పటివరకూ మూవీ రిలీజైన తర్వాత వచ్చిన రెండో శుక్రవారం అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా 'ధురంధర్' నిలిచింది. ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఈ నెల 12న రెండో శుక్రవారం రూ.34.70 కోట్ల నెట్ కలెక్షన్స్‌తో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అంతకు ముందు పుష్ప 2 (హిందీ) రూ.27.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇదే అత్యధిక కలెక్షన్స్ కాగా ఇప్పుడు ధురంధర్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇక పుష్ప 2 తర్వాత ఛావా (రూ.24.30 కోట్లు), యానిమల్ (రూ.23.53 కోట్లు) నిలిచాయి.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఈ మూవీ ఇప్పటివరకూ ఇండియావ్యాప్తంగా రూ.252 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ కలెక్షన్స్ పెరుగుతాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాలీవుడ్‌లో రైడ్ 2, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, సికందర్ మూవీస్ లైఫ్ టైం కలెక్షన్స్‌ను 'ధురంధర్' దాటేసినట్లు తెలుస్తోంది.
Also Read : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా... రణవీర్‌తో పాటు మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సారా అర్జున్, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లో ఎక్కువ రన్ టైం ఉన్న మూవీ ఇదే. అయితే, కొన్ని గల్ఫ్ దేశాల్లో ఈ మూవీని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. బహ్రెయిన్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియాతో పాటు ఖతార్, యూఏఈలో సినిమా రిలీజ్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
స్టోరీ ఏంటంటే?
1999లో విమాన హైజాక్, 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్ర దాడి తర్వాత భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. దాయాది దేశం పాక్‌ను చావు దెబ్బ కొట్టేందుకు అక్కడ ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేసేందుకు ఆపరేషన్ 'ధురంధర్' పేరుతో ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్లాన్ చేస్తాడు. దీని కోసం పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న ఓ యువకుడిని భారత ఏజెంట్‌గా హమ్జా (రణవీర్ సింగ్) అనే పేరుతో పాక్‌లోకి పంపుతాడు.
అక్కడ అతనికి ఎదురైన అనుభవాలేంటి? ఉగ్ర స్థావరాలు నాశనం చేసేందుకు హమ్జా ఏం చేశాడు? ఉగ్రవాద ముఠాల్ని పెంచుతున్న రెహమాన్ బలోచ్ (అక్షయ్ ఖన్నా)ను హమ్జా ఎలా అంతం చేశాడు? అందుకు ఎలాంటి సాహసాలు చేశాడు? అనేదే మూవీ.





















