Samantha Raj Nidimoru : ఎయిర్ పోర్టులో సమంత, రాజ్ నిడిమోరు - పెళ్లి తర్వాత ఫస్ట్ టైం కనిపించిన న్యూ కపుల్
Samantha : పెళ్లి తర్వాత సమంత, రాజ్ నిడిమోరు దంపతులు ఫస్ట్ టైం ఎయిర్ పోర్టులో కలిసి కనిపించారు. ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్తుండగా ఫోటోగ్రాఫర్స్ క్లిక్ చేశారు.

Samantha Spotted With Her Husband In The Airport : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు దంపతులు పెళ్లి తర్వాత తొలిసారి ఎయిర్ పోర్టులో కనిపించారు. ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. సమంత గ్రే స్వెట్టర్, నల్ల ఫ్యాంటులో స్టైలిష్‌గా కనిపించగా... రాజ్ టీ షర్ట్, బ్లూ జీన్స్, బ్లాక్ డెనిమ్ జాకెట్‌లో కనిపించాడు.
ఇద్దరికీ ఫోటోగ్రాఫర్స్ విషెష్ చెప్పగా... ఫోటోలకు ఫోజులిచ్చేందుకు నిరాకరించిన కపుల్ వారికి థాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి కనిపించడం ఇదే మొదటిసారి. ఈ నెల 1న ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయం వద్ద భూత శుద్ధి పద్ధతిలో ఇరువురూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
#SamanthaRuthPrabhu spotted with her husband at the airport ❤️looking lovely together 💕#MissMalini pic.twitter.com/kL8ByROg95
— MissMalini (@MissMalini) December 13, 2025
Also Read : 'రాజు వెడ్స్ రాంబాయి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఇక సినిమాల విషయానికొస్తే... సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం'లో నటిస్తున్నారు. పెళ్లైన 5 రోజులకే ఆమె షూటింగ్ సెట్‌లో జాయిన్ అయ్యారు. దీంతో ఆమె వర్క్ డెడికేషన్‌ను ప్రశంసిస్తూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆమె చేస్తున్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే 'శుభం' మూవీ తీయగా... అందులో ఆమె అతిథి పాత్రలో మెరిశారు. గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' మూవీకి 'ఓ బేబీ' ఫేం నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
రాజ్ & డీకే దర్శకత్వం వహించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' సిరీస్ రీసెంట్‌గా 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ అవుతోంది. వీరిద్దరూ దర్శకత్వం వహించబోతున్న మరో హై ఆక్టేన్ యాక్షన్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్ : ది బ్లడీ కింగ్డమ్'లో సమంత కనిపించనుంది. ఈ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బీ, జైదీప్ అహ్లావత్ కూడా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.





















