అన్వేషించండి

RBI Summer Internship: విద్యార్థుల కోసం RBI పెయిడ్ ఇంటర్న్‌షిప్, చివరి తేదీ ఇదే.. రూ.20 వేలు స్టైఫండ్

యువత కోసం RBI సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2025 దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుకు చివరి తేదీ త్వరలో ముగియనుంది. కనుక అధికారిక సైట్‌ opportunities.rbi.org.inలో దరఖాస్తు చేసుకోండి.

RBI Summer Internship 2025 | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) యువత కోసం ఈ సంవత్సరం ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2025 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 15న ప్రారంభం కాగా, ఇప్పుడు దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 15, 2025గా నిర్ణయించారు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్థిక సంస్థలలో ఒకటైన RBIతో కలిసి పనిచేసే అనుభవం పొందాలనుకునే విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ గొప్ప అవకాశమని చెప్పవచ్చు. క్రింద పేర్కొన్న step by step దశల ద్వారా సులభంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టైపెండ్ ఎంత లభిస్తుంది?

ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఇంటర్న్‌షిప్ పూర్తిగా చెల్లింపు (RBI Paid Internship)తో కూడుకున్న ప్రక్రియ. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20,000 స్టైపెండ్ లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ వ్యవధి వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి జూలై 2026 వరకు మూడు నెలలు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు RBI నిపుణులు, అధికారులు, సాంకేతిక బృందాలతో కలిసి పనిచేసే అవకాశం పొందుతారు. ఆర్థిక రంగాలలో కెరీర్ ఎంచుకోవాలనుకునే ఏ విద్యార్థి కెరీర్‌కైనా గొప్ప అనుభవం కానుంది. 

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు
  • ఇంటిగ్రేటెడ్ 5 సంవత్సరాల కోర్సు చదువుతున్న విద్యార్థులు
  • 3 సంవత్సరాల LLB చేస్తున్న విద్యార్థులు

కామర్స్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్, బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ వంటి సబ్జెక్టులతో చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ సబ్జెక్టుల విద్యార్థులకు ఆర్థిక వ్యవస్థపై నాలెడ్జ్ పొందే అవకాశం లభిస్తుంది. భవిష్యత్తులో బ్యాంకింగ్ లేదా ఆర్థిక రంగంలో ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగు చేసుకోవచ్చు. కీలకమైన ఆర్థిక రంగంపై అవగాహన పెరుగుతుంది.

ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంపిక ఎలా జరుగుతుంది?

ఈసారి RBI మొత్తం 125 సీట్లకు ఇంటర్న్‌లను ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. ఇంత తక్కువ సీట్లలో ఎంపికవడం అంత సులభం కాదు. ఎందుకంటే దేశం నలుమూలల నుండి దరఖాస్తులు వస్తాయి. ఎంపిక ప్రక్రియ 2 దశల్లో జరుగుతుంది. ఇందులో షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఉంటాయి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

Also Read: CTET February 2026 : ఫిబ్రవరి 2026 సిటెట్ నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 8న పరీక్ష, ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం

ఎక్కడ, ఎలా దరఖాస్తు చేయాలి?

దశ 1: దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు మొదట RBI అధికారిక వెబ్‌సైట్ opportunities.rbi.org.inని సందర్శించాలి
దశ 2: ఇక్కడ Current Vacancies, తరువాత Summer Placement విభాగంపై క్లిక్ చేయండి.
దశ 3: ఆన్‌లైన్ వెబ్-బేస్డ్ అప్లికేషన్ ఫారంను తెరవండి.
దశ 4: మీ పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, ఈమెయిల్, విద్యార్హతలు మొదలైన అన్ని వివరాలు ఎంటర్ చేయాలి. 
దశ 5: ఫోటో, సిగ్నేచర్, సంస్థ జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికేట్‌ను అప్‌లోడ్ చేయండి.
దశ 6: అవసరమైన ఫారమ్‌ను సబ్మిట్ చేసిన తరువాత డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయండి.

Also Read: CBSE Board Exam 2026: 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్! పరీక్షల విధానంలో సీబీఎస్ఈ భారీ మార్పులు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Sri Lanka Death Sentence: శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Embed widget