డిసెంబర్ 1, 2025న కథానాయిక సమంత రూత్ ప్రభు, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. అసలు వీళ్లిద్దరి పరిచయం ఎలా జరిగింది? ప్రేమగా ఎప్పుడు మారింది? వివాదాలు ఏమిటి? వంటివి తెలుసుకోండి.
రాజ్ - డీకే (రాజ్ నిడిమోరు - కృష్ణ దసరా కొత్తపల్లి) దర్శకత్వం వహించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సీజన్ 2లో సమంత నటించారు. జూన్ 4, 2021 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు పరిచయమైంది.
రాజ్ నిడిమోరుతో సమంతకు పరిచయం అయ్యేసరికి నాగ చైతన్యతో ఆమె విడాకులు తీసుకోలేదు. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' విడుదల సమయానికి రాజ్ - సమంతలది దర్శకుడు - నటి బంధమే.
అక్టోబర్ 2, 2021న తామిద్దరం విడిపోతున్నట్టు సమంత - నాగ చైతన్యు నుంచి ప్రకటన వచ్చింది. విడాకుల తర్వాత సమంత గురించి నాగ చైతన్య ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు.
నాగ చైతన్యతో సమంత విడాకుల ప్రకటన వచ్చిన ఏడాది (2022)కి తన భార్య శ్యామలీ దే నుంచి విడాకులు కోరుతూ రాజ్ నిడిమోరు లీగల్ ప్రొసీజర్ స్టార్ట్ చేశారు.
ఓ ఏడాది నుంచి అంటే... 2024లో సమంత - రాజ్ నిడిమోరు ప్రేమలో పడ్డారని ప్రచారం మొదలైంది. దానిని సమంత ఎప్పుడూ ఖండించలేదు.
రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోలను 2025 స్టార్టింగ్ నుంచి ఎక్కువగా పోస్ట్ చేయడం మొదలు పెట్టారు సమంత. దీపావళికి సమంత ఇంటికి వెళ్లారు రాజ్.
ఫైనల్లీ... డిసెంబర్ 1న వివాహ బంధంతో సమంత - రాజ్ నిడిమోరు ఒక్కటి అయ్యారు. ఇషా యోగ ఆధ్యాత్మిక యోగ కేంద్రంలోని లింగ భైరవి దేవి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
రాజ్ నిడిమోరు - సమంత దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు. ఈ జంట కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుందాం.