నటి సమంత వివాహ జీవితం ఎప్పుడూ చర్చల్లో ఉంటూ వచ్చింది. ఇప్పుడు తన జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించింది.

Published by: Khagesh

సమంత ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోరును డిసెంబర్‌ 1న వివాహం చేసుకుంది.

Published by: Khagesh

తమ వివాహాన్ని సమంత అధికారికంగా ధృవీకరించింది. తన సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలను షేర్ చేసింది.

Published by: Khagesh

సమంతా, రాజ్ సోమవారం ఉదయం వివాహ బంధంలోకి ప్రవేశించారు. వివాహం ఈషా యోగా కేంద్రంలోని లింగ భైరవి ఆలయంలో జరిగింది. వివాహంలో ముప్పై మంది అతిథులు పాల్గొన్నారు. సమంతా ఎరుపు రంగు చీర కట్టుకున్నారు.

Published by: Khagesh

ఆదివారం రాత్రి నుంచి వారి వివాహం గురించి చర్చ జరుగుతోంది. రాజ్ ,సమంత ఇద్దరికీ ఇది రెండో వివాహం. రాజ్ మాజీ భార్య శ్యామలీ డే కూడా Instagramలో ఓ స్టోరీని పోస్ట్ చేసింది.

Published by: Khagesh

నిరాశతో ఉన్న వ్యక్తులు నిరాశాజనకమైన పనులు చేస్తారు అని పోస్టు చేసిన తర్వాత సమంత, రాజ్‌ వివాహం గురించి పుకార్లు మరింత ఊపందుకున్నాయి. రాజ్‌ నుంచి శ్యామలి 2022లో విడాకులు తీసుకున్నారు.

Published by: Khagesh

సమంత మొదటి వివాహం నాగ చైతన్యతో జరిగింది. వాళ్లిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు సాగారు.

Published by: Khagesh

నాగా చైతన్య కూడా నటి శోభితా ధూళిపాళను రెండో వివాహం చేసుకున్నాడు. వారి వివాహం కూడా వేడుకలా జరిగింది.

Published by: Khagesh

నాగా చైతన్య నుంచి విడిపోయిన తరువాత సమంత, రాజ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో కలిసి పనిచేశారు

Published by: Khagesh

వారి సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమగా మారింది. పెళ్లి చేసుకునే సమయానికి రాజ్ నిడిమోరుకు 50ఏళ్లు, సమంతకు 38ఏళ్లు.

Published by: Khagesh